కిరాక్ లుక్ లో రామ్ చరణ్.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్!  

Ram Charan Rama Raju Look in RRR. RRR, Ram Charan new look Viral, Ram Charan RRR Look, Social Media, mega fans, RRR, Rajamouli, NTR - Telugu @alwaysramcharan, Ntr, Rajamouli, Ram Charan, Ram Charan New Look Viral, Ram Charan Rrr Look, Ram Charan Twitter, Ramaraju Look, Rrr, Social Media

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ 2007లో చిరుత సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.చిరుత సినిమా విడుదలకు ముందు, విడుదల తర్వాత రామ్ చరణ్ లుక్ పై కొన్ని నెగిటివ్ కామెంట్లు వినిపించాయి.

TeluguStop.com - Ram Charan Ramaraju Look Photo Goes Viral In Social Media

ఇతర హీరోల ఫ్యాన్స్ అయితే రామ్ చరణ్ హీరోగా క్లిక్ కావడం కొంచెం కష్టమే అని అభిప్రాయపడ్డారు.రామ్ చరణ్ నటన విషయంలో కూడా చిరంజీవిని అనుసరిస్తున్నాడని కామెంట్లు వినిపించాయి.
అయితే తనపై వచ్చిన విమర్శలన్నింటికీ మగధీర సినిమాతో రామ్ చరణ్ చెక్ పెట్టేశాడు.రెండో సినిమా మగధీరతోనే స్టార్ హీరో స్టేటస్ ను అందుకున్నాడు.ఆ తరువాత మాస్ సినిమాలకు ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చిన చరణ్ ఆ సినిమాలతో విజయాలు సాధించాడు.రంగస్థలం సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్న రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తారక్ తో కలిసి ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు.
రచ్చ, నాయక్, ఎవడు లాంటి సినిమాల్లో ఒకే లుక్ లో కనిపించిన రామ్ చరణ్ లుక్ పై విమర్శలు రావడంతో గోవిందుడు అందరివాడేలే సినిమాలో రామ్ చరణ్ పిలక జుట్టుతో, ధృవ సినిమాలో స్టైలిష్ పోలీస్ గా, రంగస్థలం సినిమాలో పల్లెటూరి యువకుడి పాత్రలో అద్భుతంగా నటించారు.ఇప్పటికే విడుదలైన ఆర్ఆర్ఆర్ టీజర్ లో రామ్ చరణ్ బెస్ట్ లుక్ లో కనిపించాడు.
ఈ సినిమాలో రామరాజు పాత్ర లుక్ చాలా బాగుందని చరణ్ కు ప్రశంసలు దక్కాయి.కరోనా, లాక్ డౌన్ వల్ల ఆరు నెలల నుంచి షూటింగ్ కు దూరంగా ఉన్న రామ్ చరణ్ త్వరలో ఆర్ఆర్ఆర్ షూటింగ్ మొదలు కానున్న నేపథ్యంలో ఆ పాత్రకు తగినట్టు మేకోవర్ అవుతున్నాడు.

రామ్ చరణ్ తన ట్విట్టర్ ఖాతాలో రామరాజు లుక్ కు సంబంధించిన ఫోటో షేర్ చేశాడు.అభిమానులకు గూస్ బంప్స్ వచ్చేలా ఉన్న చరణ్ ఫోటోను ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.

TeluguStop.com - కిరాక్ లుక్ లో రామ్ చరణ్.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image
#Ramaraju Look #RamCharan #Social Media #Rajamouli #Ram Charan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ram Charan Ramaraju Look Photo Goes Viral In Social Media Related Telugu News,Photos/Pics,Images..