రామ్ చరణ్ ఆ ముద్రను చేరిపేసుకుంటాడా ?

మెగా వారసుడు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి దక్కిన ఘనమైన స్వాగతం బహుశా ఇంకే సినీ వారసుడికి దక్కలేదేమో.మొదటి చిత్రం అప్పటి ఇండస్ట్రీ హిట్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో.

 Will Ram Charan Cross 50 Crores..?-TeluguStop.com

రెండో చిత్రం అసలు ఫ్లాప్ అనే పదమే ఎరుగని రాజమౌళితో.రెండో సినిమాతోనే ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు చరణ్.

మగధీర తో తొలిసారి 50 కోట్ల మార్కును అందుకుంది తెలుగు చిత్ర సీమ.అయితే దాన్ని రాజమౌళి అకౌంట్ లో వేసేసారు అందరు.ఆ వాదానికి మరింత బలం చేకూరుస్తూ మళ్ళి 50 కోట్ల మార్కును అందుకోలేకపోయాడు చరణ్.రచ్చ,నాయక్,ఎవడు,గోవిందుడు అందరివాడేలే … ఇన్ని హిట్ సినిమాలు వచ్చినా రామ్ చరణ్ కు 50 కోట్లు సాధ్యపడలేదు.

మగధీర రామ్ చరణ్ స్టామినా కాదు అనే ముద్ర పడిపోయింది.

బ్రూస్లీ తో అయినా 50 కోట్లు అందుకుంటాడా చరణ్ అనేది ఇప్పుడు ఆసక్తికరమైన విషయం.ఈసారి దర్శకుడికి అంత క్రెడిట్ దక్కకపోవచ్చు.ఎందుకంటే శ్రీనువైట్ల కి 50 కోట్లు దాటినా చిత్రం ఒకటే ఉంది.

అది కుడా మహేష్ బాబు సినిమా, దూకుడు.

నాణేనికి ఇంకో వైపు ఆలోచిస్తే .బ్రూస్లీ చిరంజీవి వల్ల 50 కోట్లు దాటింది అనే వాదన రావడానికి అవకాశం లేకపోలేదు.మరి చరణ్ తనపై ఉన్న ఆ ముద్రను ఎప్పుడు చేరిపేసుకుంటాడు ?

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube