రాజా ది గ్రేట్ సినిమా తర్వాత వరుసగా మూడు డిజాస్టర్ సినిమాలు చేసిన మాస్ మహారాజ్ రవితేజ ఎట్టకేలకు మళ్ళీ క్రాక్ సినిమాతో ఫామ్ లోకి వచ్చాడు.ఆకలితో ఉన్న సింహాని జింకపిల్ల దొరికినట్లు రవితేజకి క్రాక్ సినిమా పడింది.
సంక్రాంతి ఫెస్టివల్ లో ఫస్ట్ బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ గా క్రాక నిలిచింది.ఇక క్రాక్ కి పోటీ ఇచ్చేనందుకు మాస్టర్ సినిమా వచ్చిన నిలబడలేకపోయింది.
ఇప్పుడు అల్లుడు అదుర్స్, రామ్ రెడ్ సినిమాలు ఉన్నాయి.అవి హిట్ అయినా కూడా క్రాక్ సినిమాకి వస్తున్నా క్రేజ్ మాత్రం తగ్గే అవకాశం లేదు.
థియేటర్స్ 50 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్న కూడా హౌస్ ఫుల్ అవుతున్నాయి.మళ్ళీ ప్రేక్షకులని ఈ సినిమా థియేటర్స్ వైపు రప్పిస్తుంది.
ఈ నేపధ్యంలో సినిమా సక్సెస్ పై రవితేజ, గోపీచంద్ టీం ఫుల్ ఖుషిగా ఉన్నారు.ఇదిలా ఉంటే ఈ సినిమా సక్సెస్ కొట్టి మళ్ళీ రవితేజ ఫామ్ లోకి రావడంపై మెగా హీరో రామ్ చరణ్ ఆసక్తికర వాఖ్యలు చేశారు.
మెగాపవర్ స్టార్ రాంచరణ్ సినిమా చూసి ట్విట్టర్ వేదికగా క్రాక్ టీమ్ కు శుభాకాంక్షలు తెలిపాడు.నా ఫేవరేట్ రవితేజ క్రాక్ తో ఫామ్ లోకి వచ్చేసాడు.
శృతిహాసన్ తన బెస్ట్ ఇచ్చింది.సముద్రఖని వరలక్ష్మిలు గొప్పగా నటించారు.
ఇక తమన్ నేపథ్య సంగీతం సినిమాను మరో స్టేజికి తీసుకెళ్ళింది.డైరెక్టర్ గోపీచంద్ వర్క్ టాప్ లెవెల్ లో ఉంది అంటూ అభినందించాడు.
మొత్తానికి దర్శకుడు గోపీచంద్ మలినేని ఒక రియల్ ఇన్సిడెంట్స్ స్ఫూర్తిగా నిజజీవిత కథలని స్ఫూర్తిగా తీసుకొని రాసుకున్న క్రాక్ కథతో రవితేజకి హ్యాట్రిక్ హిట్ ఇచ్చాడని చెప్పాలి..