రామ్‌ చరణ్‌ మామూలోడు కాదుగా!     2018-06-30   01:07:46  IST  Raghu V

ఈతరం స్టార్‌ హీరోలు ఆదాయానికి అనేక మార్గాలు వెదుక్కుంటున్నారు. సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు ఒకవైపు హీరోగా నటిస్తూనే మరో వైపు వరుసగా బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇక తాను నటిస్తున్న సినిమాల నిర్మాణంలో భాగస్వామ్యం తీసుకుంటూ కూడా అదనపు సొమ్మును తన ఖాతాలో వేసుకుంటున్నాడు. దాంతో పాటు ఇతరత్ర బిజినెస్‌లో కూడా మహేష్‌బాబు పెట్టుబడులు పెడుతున్నాడు. ఇలా దాదాపు అందరు యువ హీరోలు కూడా ఏదో ఒక మార్గంలో ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అందరిలో కంటే రామ్‌ చరణ్‌ ఎక్కువగా బిజినెస్‌ మైండెడ్‌గా ఆలోచిస్తున్నాడు.

ఆమద్య ఎయిర్‌లైన్స్‌ను ప్రారంభించి, అందరి దృష్టిని ఆకర్షించిన రామ్‌ చరణ్‌ ఆ తర్వాత పలు వ్యాపారాల్లో తనదైన ముద్రను వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. తన తండ్రి సినిమా అంటే ఖచ్చితంగా మంచి క్రేజ్‌ ఉంటుందని భావించి చిరంజీవి 150వ చిత్రంను స్వయంగా నిర్మించాడు. ఆ చిత్రం సూపర్‌ హిట్‌ అయ్యి చరణ్‌కు దాదాపుగా 100 కోట్ల మేరకు లాభాలు తెచ్చి పెట్టింది. దాంతో ప్రస్తుతం తండ్రి 151వ చిత్రాన్ని కూడా స్వయంగా నిర్మిస్తున్నాడు. సైరా నరసింహారెడ్డికి పూర్తి స్థాయి నిర్మాతగా వ్యవహరిస్తున్న చరణ్‌ మరోసారి భారీ లాభాలపై దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది.