ఆ విషయంలో చిరుని ఫాలో అవుతున్న పవన్, చరణ్!

మెగాస్టార్ చిరంజీవి ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెహ పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక విషయంలో ఫాలో అవుతున్నారు.గత కొంత కాలంగా చిరు తరహాలో రేర్ ఫీట్ చేయని ఈ స్టార్స్ ఇప్పుడు చిరుని ఫాలో అవుతున్నారు.

 Ram Charan Pawan Kalyan Following Megastar , Ram Charan , Pawan Kalyan Followin-TeluguStop.com

మెగాస్టార్ తన కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచినా బిల్లా రంగా, బందిపోటు, స్నేహం కోసం, అందరి వాడు వంటి సినిమాల్లో ద్విపాత్రాభినయం చేసిన విషయం తెలిసిందే.

ఈ సినిమాల్లో ఆయన తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం పోషించాడు.

ఇప్పుడు మళ్ళీ మెగాస్టార్ వాల్తేరు వీరయ్య సినిమాలో కూడా తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేయనున్నాడు.బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

అయితే ఇప్పుడు చిరుని పవన్ కళ్యాణ్, చరణ్ కూడా ఫాలో అవుతున్నారు.

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం భీమ్లా నాయక్ సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమా తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భవదీయుడు భగత్ సింగ్ సినిమాలో నటిస్తున్నాడు.తెలంగాణ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో పవన్ తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేయనున్నాడట.

మరి తొలిసారి పవన్ ఇలా కనిపించ బోతున్నాడు.

ఇక చరణ్ కూడా ఇలానే వీరిని ఫాలో అవనున్నట్టు తెలుస్తుంది.చరణ్ తన కెరీర్ లో మొదటిసారి తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేయనున్నాడని రెండు పాత్రలు కూడా కొత్తగా మేకోవర్ తో ఉండ బోతున్నాయని చెబుతున్నారు.చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో నటిస్తున్నాడు.

ఈ సినిమాలోనే చరణ్ తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేయనున్నాడని ఇండస్ట్రీలో టాక్ గట్టిగానే వినిపిస్తుంది.

Ram Charan Pawan Kalyan Following Megastar , Ram Charan , Pawan Kalyan Following Megastar , Ram Charan , Pawan Kalyan , Chiranjeevi , Waltheru Virayya ,babi , Beemla Nayak , Shanker - Telugu Babi, Beemla Nayak, Chiranjeevi, Pawan Kalyan, Ram Charan, Shanker

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube