'సైరా' నష్టాల్లో రామ్‌ చరణ్‌ వాటా ఎంత?

చిరంజీవి 151వ చిత్రం ‘సైరా’ను రామ్‌ చరణ్‌ దాదాపుగా 300 కోట్ల బడ్జెట్‌తో నిర్మించాడంటూ వార్తలు వచ్చాయి.కాని యూనిట్‌ సభ్యుల నుండి అందుతున్న సమాచారం ప్రకారం సినిమాకు అయిన ఖర్చు 250 కోట్లు.

 Ram Charan Partnership In Sye Raa Narasimhareddy Failure-TeluguStop.com

ఈ మొత్తంను ప్రీ రిలీజ్‌ బిజినెస్‌తోనే నిర్మాత చరణ్‌ రాబట్టుకున్నాడని సమాచారం అందుతోంది.థియేట్రికల్‌ రైట్స్‌ ద్వారానే దాదాపుగా 200 కోట్ల రూపాయలను దక్కించుకున్న రామ్‌ చరణ్‌ ఇతర రైట్స్‌ ద్వారా కూడా భారీ మొత్తాన్ని రాబట్టాడు.

నిర్మాత చరణ్‌కు అయితే సైరా చిత్రం పెద్దగా నష్టాలను మిగిల్చింది లేదు.కాని చాలా ఏరియాల్లో సైరా చిత్రం బయ్యర్లు దారుణమైన నష్టాలను చవి చూస్తున్నారు.ముఖ్యంగా హిందీ రైట్స్‌ను కొనుగోలు చేసిన బయ్యర్‌ ఏకంగా పాతిక నుండి 35 కోట్ల వరకు నష్టపోయినట్లుగా ప్రచారం జరుగుతోంది.ఇక యూఎస్‌ రైట్స్‌ కొనుగోలు చేసిన బయ్యర్లు దాదాపుగా 8 కోట్ల వరకు నష్టపోయారట.

ఇంకా పలు ప్రాంతాల్లో బయ్యర్లు నష్టాలను చవిచూశారు.మొత్తంగా 80 నుండి 90 కోట్ల వరకు బయ్యర్లు నష్టపోయి ఉంటారని టాక్‌ వస్తుంది.

Telugu Chiranjeevi, Nayana Tara, Ram Charan, Sye Raa Simha, Tamanna, Telugutolly

  ఈ లాస్‌ మొత్తంలో కనీసం సగం అయినా భరించాలంటూ నిర్మాత చరణ్‌కు బయ్యర్లు విజ్ఞప్తి చేస్తున్నారట.కాని ప్రొడక్షన్‌ టీం మాత్రం తాము 300 కోట్లు ఖర్చు చేస్తే తమకు అంత మొత్తంలో ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ కాలేదు.తాము లాస్‌కు అమ్మేయడం జరిగింది.తమకు సైరా వల్ల చాలా లాస్‌ ఉందని చెబుతున్నారట.బయ్యర్లు మాత్రం డైరెక్ట్‌గా చరణ్‌తో మాట్లాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.కాని చరణ్‌ మాత్రం అందుబాటులోకి రావడం లేదు.

త్వరలోనే చరణ్‌ ఈ విషయమై ప్రకటన చేసే అవకాశం ఉంది.ఇంత నష్టంలో ఒక విషయం చరణ్‌కు సంతోషంను కలిగించేది ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో సైరా వంద కోట్ల వసూళ్లు సాధించడం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube