రామ్ చరణ్ సినిమా వల్ల నష్టపోయానంటున్న ప్రముఖ నిర్మాత..?

చాలా సందర్భాల్లో స్టార్ హీరోల సినిమాలు, చిన్న హీరోల సినిమాలు పోటీ పడితే చిన్న హీరోల సినిమాలకు హిట్ టాక్ వచ్చినా కలెక్షన్లు వచ్చే అవకాశం తక్కువ.అందువల్లే చిన్న సినిమాల నిర్మాతలు స్టార్ హీరోల సినిమాలు విడుదలయ్యే రెండు వారాల ముందు కానీ వెనుక కానీ తమ సినిమాలు విడుదలయ్యేలా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు.

 Ram Charan Orange Film Put A Hold On Our Film Dream Run Says By Radha Mohan,ramc-TeluguStop.com

తాజాగా ప్రముఖ నిర్మాత కె.కె.రాధామోహన్ ఆరెంజ్ సినిమా తమ సినిమాను దెబ్బ కొట్టిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

వరుణ్ సందేశ్, నిషా అగర్వాల్ జంటగా సంపత్ నంది దర్శకత్వంలో రాధా మోహన్ నిర్మాతగా తెరకెక్కిన ఏమైంది ఈ వేళ సినిమా 2010 సంవత్సరం నవంబర్ 12న విడుదలైంది.

ఈ సినిమా పదేళ్లు పూర్తి చేసుకోబోతున్న నేపథ్యంలో దర్శకుడు సంపత్ నంది ఏమైంది ఈ వేళ సినిమాకు తనకు దర్శకుడిగా అవకాశం ఇచ్చిన రాధామోహన్ కు సోషల్ మీడియా వేదికగా ధన్యవాదాలు తెలిపారు.

సంపత్ నంది పోస్ట్ కు రాధామోహన్ స్పందిస్తూ కళ్యాణ్ రామ్ కత్తి, ఏమైంది ఈ వేళ సినిమాలు ఒకేరోజు విడుదలయ్యాయని.

గోకుల్ థియేటర్ ఓనర్ ఏమైంది ఈ వేళ లాంటి చిన్న సినిమాకు తొలి వారం అన్ని షోలకు హౌస్ ఫుల్ కావడంతో ఆశ్చర్యపోయాడని.అయితే ఏమైంది ఈ వేళ విడుదలైన కొన్ని రోజులకే ఆరెంజ్ సినిమా విడుదల కావడంతో సినిమా డ్రీమ్ రన్ పై దెబ్బ పడిందని.

ఆ విధంగా రామ్ చరణ్ సినిమా వల్ల నష్టపోయానని పరోక్షంగా చెప్పారు.

అయితే రామ్ చరణ్ అభిమానులు మాత్రం ఏమైంది ఈ వేళ సినిమా విడుదలైన రెండు వారాలకు ఆరెంజ్ సినిమా విడుదలైందని.

అందువల్ల ఆరెంజ్ సినిమా ఏమైంది ఈ వేళ డ్రీమ్ రన్ పై దెబ్బ కొట్టిందనడంలో వాస్తవం లేదని అభిప్రాయపడుతున్నారు.నాగబాబు నిర్మాతగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆరెంజ్ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube