ఇండియన్ 2 సినిమాని దర్శకుడు శంకర్ మళ్ళీ స్టార్ట్ చేస్తూ ఉండటంతో అతని దర్శకత్వంలో రామ్ చరణ్ దిల్ రాజు ప్రొడక్షన్ లో నెక్స్ట్ చేయబోయే సినిమాకి మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.ఇండియన్ 2 మూవీ షూటింగ్ కంప్లీట్ చేయడంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ అంతా పూర్తి చేసిన తర్వాత శంకర్ రామ్ చరణ్ తో సినిమా స్టార్ట్ చేసే అవకాశం ఉంది.
అయితే దీనికి కనీసం ఆరు నెలల సమయం అయిన పట్టే అవకాశం ఉంది.ప్రస్తుతం ఆర్ఆర్ఆర్, ఆచార్య మూవీలని కంప్లీట్ చేసిన రామ్ చరణ్ వచ్చే నెలలో ఖాళీ అయిపోయే అవకాశం ఉంది.
అన్ని అనుకూలంగా జరిగి ఉంటే జులైలో శంకర్ తో సినిమా స్టార్ట్ అయ్యే అవకాశం ఉండేది.
అయితే ఇప్పుడు అది కాస్తా ఆలస్యం కావడంతో ఈ లోపు మరో సినిమా చేయాలనే ఆలోచనతో రామ్ చరణ్ ఉన్నట్లు తెలుస్తుంది.
ఇప్పటికే కోలీవుడ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్, అలాగే టాలీవుడ్ కి చెందిన ఇద్దరు సక్సెస్ ఫుల్ దర్శకులు రామ్ చరణ్ కి కథలు చెప్పి ఉన్నారు.ఆ కథలు చరణ్ కి నచ్చిన శంకర్ సినిమా స్టార్ట్ ఎనౌన్స్ కావడంతో వాటిని హోల్డ్ లో పెట్టారు.
ఇప్పుడు వాటిలో ఒకదానిని ముందుకి తీసుకొచ్చి రామ్ చరణ్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నట్లు బోగట్టా.అయితే ఆ అవకాశం ఎవరికి దొరుకుతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
మరో వైపు లూసీఫర్ రీమేక్ లో పృధ్వీ రాజ్ చేసిన పాత్రలో కూడా తాను చేస్తే ఎలా ఉంటుందనే విషయాన్ని దర్శకుడు మోహన్ కృష్ణతో చరణ్ చర్చిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది.