ఆలస్యంకు కోటి రూపాయలు అదనంగా ఇస్తానన్న చరణ్‌.. అందుకే కోరటాల వెయిటింగ్‌  

Ram Charan Offers 1 Crore To Koratala For The Late Of His Movie-chiranjeevi Next Movie,koratala Shiva,ram Charan,ram Charan Next Movie,ram Charan Producing Movie

మెగాస్టార్‌ చిరంజీవి 151వ చిత్రం సైరా నరసింహారెడ్డి చిత్రం వరుసగా ఏదో కారణం వల్ల ఆలస్యం అవుతూనే ఉంది. ఎన్నో అంచనాల నడుమ తెరకెక్కుతున్న సైరా నరసింహారెడ్డి చిత్రంను ఎక్కడ కూడా లైట్‌ తీసుకోకుండా జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నాడు. అందుకే సైరా చిత్రం దాదాపు రెండు సంవత్సరాలుగా రూపొందుతూనే ఉంది. ఇదే సమయంలో చిరంజీవి 152వ చిత్రం కూడా లైన్‌లోకి వచ్చింది. చిరంజీవి 152వ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించబోతుండగా, రామ్‌ చరణ్‌ నిర్మించబోతున్నాడు..

ఆలస్యంకు కోటి రూపాయలు అదనంగా ఇస్తానన్న చరణ్‌.. అందుకే కోరటాల వెయిటింగ్‌-Ram Charan Offers 1 Crore To Koratala For The Late Of His Movie

గత ఏప్రిల్‌లో భరత్‌ అనే నేను చిత్రంతో కొరటాల శివ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

ఆ సినిమా వచ్చి సంవత్సరం కాబోతున్నా కూడా ఇంకా కొరటాల శివ తదుపరి చిత్రం మొదలు కాకపోవడంతో ఆయన అభిమానులు తీవ్ర అసహనంతో ఉన్నారు. సూపర్‌ హిట్‌ను అందించిన ఒక దర్శకుడు మరీ ఇంత దారుణంగా సంవత్సరం పాటు సమయంను వృదా చేయడం ఏంటీ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొరటాల శివ కూడా తనకు ఇంత సమయం ఖాళీ ఉంటే కుదరదని, మరో సినిమాను చూసుకుంటాను అంటూ రామ్‌ చరణ్‌కు చెప్పాడట..

దాంతో తన తండ్రి సినిమాను కొరటాల వదిలేయవద్దనే ఉద్దేశ్యంతో చరణ్‌ కోటి రూపాయల ఆఫర్‌ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

సినీ వర్గాల్లో వినిపిస్తున్న గుసగుసల ప్రకారం రామ్‌ చరణ్‌ సొంతంగా చిరంజీవి 152వ చిత్రాన్ని నిర్మించాలనుకున్నాడు. కాని ఆలస్యం అవుతున్న కారణంగా నష్టపరిహారం అన్నట్లుగా సినిమాలో నిర్మాణ భాగస్వామ్యం ఇవ్వాలని నిర్ణియించుకున్నాడట. దాంతో పాటు కోటి రూపాయల అదనపు పారితోషికం కూడా ఇవ్వాలని నిర్ణయించుకున్నాడట.

దాంతో ఇన్ని ఆఫర్లు ఇచ్చిన చరణ్‌ ను వదిలేసేందుకు కొరటాల శివ ఆసక్తి చూపడం లేదు. త్వరలోనే సినిమా ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. 2020వ సంవత్సరాలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.