‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా అనుకుంటున్నది ఒకటి చూడబోతున్నది మరోటి  

Ram charan NTR RRR story not Patriotism movie RRR, Ramcharan, NTR, Rajamouli, Komaram Bheem, Alluri Seetha Ramaraju - Telugu Ntr, Rajamouli, Ram Chara, Rrr, Telugu Film News

టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా నేపథ్యం ఏంటి అని ఎవరిని ప్రశ్నించినా కూడా చిన్నవారి నుండి పెద్ద వారి వరకు ప్రతి ఒక్కరూ స్వాతంత్ర సమరయోధులు గా హీరోలిద్దరూ కనిపించబోతున్నారు అంటూ గుక్కతిప్పుకోకుండా చెప్పేస్తున్నారు. రాజమౌళి ప్రెస్ మీట్ లో కూడా చెప్పింది కూడా అదే.

TeluguStop.com - Ram Charan Ntr Rrr Story Not Patriotism Movie

రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజుగా ఎన్టీఆర్ కొమరం భీం గా నటించబోతున్నట్లు గా పేర్కొన్నారు.వారిద్దరు కూడా స్వాతంత్ర్య సమరయోధులు మన అందరికి తెలిసిందే.

కనుక అందరు కూడా ఈ సినిమా స్వాతంత్రం కు ముందు జరిగిన కథతో తెరకెక్కిస్తున్నట్లు గా.బ్రిటీష్ ‌ వారితో వీరిద్దరు స్వాతంత్ర్యం కోసం పోరాడిన వారిగా కనిపించబోతున్నట్లుగా భావిస్తున్నారు.కానీ అసలు విషయం ఏంటంటే ఈ సినిమాలో హీరోలు రామరాజు మరియు కొమరం భీమ్ లు అనే విషయం నిజమే అయినప్పటికీ స్వాతంత్ర ఉద్యమ కథ కాదంటూ చిత్ర యూనిట్ సభ్యులు క్లారిటీ ఇచ్చారు.

TeluguStop.com - ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా అనుకుంటున్నది ఒకటి చూడబోతున్నది మరోటి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఈ సినిమా దేశ భక్తి సినిమా కాదని ఒక సాధారణ కమర్షియల్ సినిమా అంటూ ఇటీవల ఆర్ఆర్ఆర్‌ యూనిట్ ట్విట్టర్ ద్వారా పేర్కొనడం జరిగింది.

దాంతో ఈ సినిమాపై ఉన్న అంచనాలు మరింతగా ఎక్కువైంది.హీరోలు ఇద్దరూ కూడా బ్రిటీష్‌ వారితో స్వాతంత్రం కోసం పోరాడకుండా మరి దేని కోసమో పోరాడినట్లు గా దర్శకుడు రాజమౌళి చూపించబోతున్నట్లుగా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇది బ్రిటిష్ కాలం నాటి స్టోరీ అయినా కూడా స్వాతంత్ర ఉద్యమం కథ కాదంటూ టీం క్లారిటీ ఇచ్చింది.మొత్తానికి ప్రేక్షకులు అనుకుంటున్నది ఒకటైతే సినిమాలో చూడబోతున్న ది మరొకటిగా తెలుస్తోంది.

ఈ సినిమాకు కీరవాణి సంగీతాన్ని అందిస్తుండగా బాలీవుడ్‌ స్టార్స్‌ ఆలియా భట్‌ మరియు అజయ్‌ దేవగన్‌ లు కీలక పాత్రలో కనిపించబోతున్నారు.

#Rajamouli #Ram Chara

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ram Charan Ntr Rrr Story Not Patriotism Movie Related Telugu News,Photos/Pics,Images..