రామరాజు కోసం భీం.. మరి భీం కోసం ఎవరు లేరా?

దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరు చూస్తున్నారు.

 Ram Charan Will Not Give Voice, Ram Charan, Ntr, Rrr, Rajamouli, Bheem, Ramaraju-TeluguStop.com

ఇక ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని వారు లెక్కలు వేస్తున్నారు.

కాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ లోగో, మోషన్ పోస్టర్, రామ్ చరణ్ ఫస్ట్ లుక్‌లను ఇటీవల రిలీజ్ చేసి సినిమాపై అంచనాలను పీక్స్‌కు తీసుకెళ్లారు.

రామ్ చరణ్ ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు.ఇక ఈ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ వీడియోలో రామ్ చరణ్ పాత్రను యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎలివేట్ చేసిన విధానం ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పించాయి.

రామరాజు కోసం భీం(భీం ఫర్ రామరాజు) అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఈ వీడియో ట్రెండింగ్‌లో నిలిచింది.

ఇక ఎన్టీఆర్ చేస్తున్న కొమురం భీం పాత్ర ఫస్ట్ లుక్‌ను ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కొమురం భీం పాత్రకు రామరాజు వాయిస్ ఎలా ఉంటుందో చూడాలని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.మరి భీం పాత్రకు రామరాజు వాయిస్ ఇస్తాడా లేడా అనేది కూడా ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

సినీ వర్గాల సమాచారం మేరకు కొమురం భీం ఫస్ట్ లుక్‌కు చరణ్ వాయిస్ కాకుండా వేరే వాయిస్‌ను ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది.మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో చూడాలి అంటున్నారు ఫ్యాన్స్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube