బాహుబలి, బాహుబలి 2 సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి “రౌద్రం రణం రుధిరం” పేరుతో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా సినిమాను తెరకెక్కిస్తున్నసంగతి తెలిసిందే.గత రెండు రోజుల నుంచి ఆర్ఆర్ఆర్ సినిమా కథ ఇదేనంటూ సోషల్ మీడియాలో ఒక స్టోరీ చక్కర్లు కొడుతోంది.
ఇప్పటికే విడుదలైన టీజర్లలో చూసిన సన్నివేశాలతో లీకైన కథకు దగ్గర పోలికలు ఉండటంతో చాలామంది ఫ్యాన్స్ లీకైన స్టోరీనే ఒరిజినల్ స్టోరీనేమో అని టెన్షన్ పడుతున్నారు.లీకైన కథ ప్రకారం సీతారామరాజు, కొమరం భీమ్ స్వాతంత్రం తీసుకురావడానికి వేర్వేరు మార్గాలను ఎంచుకుని పోరాటం చేస్తూ ఉంటారు.
ఉన్నత చదువులు చదువుకున్న రామరాజు బ్రిటీషర్ల దగ్గర ఉద్యోగం చేస్తూ చట్టబద్ధంగా భారతదేశానికి స్వతంత్రం కోసం పోరాడుతుండగా కొమరం భీమ్ మాత్రం యుద్ధం చేస్తేనే స్వాతంత్రం వస్తుందని తను నివశించే చోట ఉన్నవాళ్లకు యుద్ధవిద్యలో శిక్షణ ఇస్తుంటారు.
ఒకానొక సందర్భంగా కొన్ని కారణాల వల్ల రామ్ చరణ్ భీమ్ ను అరెస్ట్ చేస్తాడు.అయితే ఆ తరువాత ఒకరి గురించి మరొకరు తెలుసుకుని ఇద్దరూ కలిసి స్వాతంత్రం కోసం పోరాటం చేస్తారు.అయితే ఈ కథ ఫ్యాన్ మేడ్ స్టోరీనో రియల్ స్టోరీనో తెలియాల్సి ఉంది.
అయితే రాజమౌళి సినిమాల కథ తెలిసినా కథనంతోనే మ్యాజిక్ చేస్తాడు కాబట్టి ఈ సినిమా స్టోరీ గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు.అందువల్ల సినిమా కథ ఇదే అయినా కాకపోయినా నష్టమైతే లేదు.అయితే ఆర్ఆర్ఆర్ సినిమా లీకేజీలు ఫ్యాన్స్ ను తెగ టెన్షన్ పెడుతున్నాయి.అయితే ఫ్యాన్స్ లో కొందరు లీకైన స్టోరీ రియల్ స్టోరీ అని చెబుతుంటే మరికొందరు మాత్రం అసలు కథ ఇది కాదని అభిప్రాయపడుతున్నారు.
అయితే ఆర్ఆర్ఆర్ యూనిట్ మాత్రం స్టోరీ లీక్ అంటూ వస్తున్న వార్తలను లైట్ తీసుకోవడం గమనార్హం.