RRR : గుమ్మడికాయ కొట్టకుండా కేక్‌ కట్‌ చేశారు

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వం లో ప్రస్తుతం తెరకెక్కుతున్న ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా చిత్రీకరణ ముగిసింది.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ పూర్తి అయినట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.

 Ram Charan Ntr Rrr Movie Shooting Wrap-TeluguStop.com

షూటింగ్ పూర్తి అయిన వెంటనే గుమ్మడి కాయ కొట్టేసి దిష్టి తీసి సినిమా ను విడుదల చేసేందుకు సిద్దం చేస్తారు.కాని ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిన సందర్బంగా ఆర్ ఆర్‌ ఆర్‌ అని ఉన్న కేక్ ను జక్కన్న చేత యూనిట్‌ సభ్యులు కట్‌ చేయించారు.

జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో అద్బుతమైన సాంకేతిక నిపుణులతో రూపొందిన ఈ సినిమా చిత్రీకరణ గత ఏడాదిలోనే పూర్తి అవ్వాల్సి ఉన్నా కూడా కరోనా కారణంగా ఆలస్యం అయ్యింది.ఆలస్యంకు దాదాపుగా 150 కోట్ల నష్టం తప్పదు అంటున్నారు.

సినిమాకు ఇంతటి భారీగా ఖర్చు చేసిన దానయ్య సినిమా ను ది బెస్ట్‌ అన్నట్లుగా ఉండేలా జక్కన్న తెరకెక్కించాడు.రికార్డ్‌ బ్రేకింగ్‌ వసూళ్లను ఈ సినిమా దక్కించుకుంటుంది అనేది ప్రతి ఒక్కరి మాట.ఆ విషయంలో ఎలాంటి సందేహం లేకుండా జక్కన్న ఆర్ ఆర్‌ ఆర్ ను రామ్‌ చరణ్ మరియు ఎన్టీఆర్‌ లతో అద్బుతమైన స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వం తో తెరకెక్కిస్తున్నాడు.

Telugu Rajamouli, Rajamouli Cake, Ram Charan, Ram Charan Ntr, Rrr-Movie

రికార్డ్‌ బ్రేకింగ్‌ వసూళ్ల తో ఈ సినిమా ను విడుదల చేసేందుకు గాను చిత్ర యూనిట్‌ సభ్యులు అక్టోబర్ ను అనుకుంటున్నారు.ఒక వేళ ఆ సమయంలో ఏదైనా ఇబ్బంది అయ్యి విడుదల కాకుంటే అప్పుడు వచ్చే ఏడాది జనవరి 26న విడుదల చేస్తామని యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.విడుదల విషయంలో కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నా కూడా చిత్ర యూనిట్‌ సభ్యుల నుండి స్పందన కరువయ్యింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube