ఆర్ఆర్ఆర్ సంక్రాంతి గిఫ్ట్.. సరికొత్త పోస్టర్ రిలీజ్?

Ram Charan Ntr Rrr Movie New Sankranthi Poster Release

ఈ ఏడాది సంక్రాంతి పండుగకు ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ సినిమాలు విడుదల అవుతాయి.దీంతో థియేటర్ల వద్ద సందడి వాతావరణం నెలకొంటుంది అని అందరూ భావించారు.

 Ram Charan Ntr Rrr Movie New Sankranthi Poster Release-TeluguStop.com

కానీ చివర్లో సీన్ మొత్తం రివర్స్ అయ్యింది.సినిమా విడుదలకి మరికొన్ని రోజులే సమయం ఉండటంతో ఇంతలో సినిమా విడుదల తేదీని వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించారు.

దీంతో ఒక్కసారిగా ప్రేక్షకుల ఆశలను ఆవిరి చేసినట్లు అయింది.ఈ సినిమాను జనవరి 7న విడుదల చేయాల్సి ఉండగా కరోనా మహమ్మారి వల్ల ఈ సినిమా విడుదల తేదీని వాయిదా వేశారు.

 Ram Charan Ntr Rrr Movie New Sankranthi Poster Release-ఆర్ఆర్ఆర్ సంక్రాంతి గిఫ్ట్.. సరికొత్త పోస్టర్ రిలీజ్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సినిమా విడుదల తేదీ మరొకసారి వాయిదా పడటంతో తారక్ అభిమానులు, చెర్రీ అభిమానులు తీవ్ర నిరాశ చెందారు.

అయితే అభిమానులలో జోష్ నింపడానికి సంక్రాంతి కానుకగా ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు రాజమౌళి.

సంక్రాంతి పండుగకు ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు రిలీజ్ చేస్తూ, సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ త్వరలోనే సినిమాను మీ ముందుకు తీసుకువస్తాము అంటూ రాజమౌళి ప్రేక్షకులకు ప్రామిస్ చేశారు.ఆర్ఆర్ఆర్ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఎదురు చూస్తున్న అభిమానులకు ఆ సినిమా నుంచి పోస్టర్ విడుదల అవడంతో ఆ పోస్టర్ క్షణాల్లో వైరల్ అయ్యింది.

ఇక ఆ పోస్టర్ ల్లో కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు నటించిన ఎన్టీఆర్ రామ్ చరణ్ లుక్స్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి.

పోస్టర్ ని చూసిన అభిమానులు సినిమాను వీలైనంత తొందరగా రిలీజ్ చేయండి అని కామెంట్ చేస్తున్నారు.ఇక పోతే అంతా అనుకున్న విధంగా జరిగితే ఏప్రిల్ మొదటివారంలోనే ఈ సినిమాను రిలీజ్ చేయడానికి రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.మరి ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది అన్న విషయం తెలియాలి అంటే అధికారికంగా ప్రకటన వచ్చే అంతవరకు వేచి చూడాల్సిందే.

ఈ సినిమాకు టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.ఇందులో ఆలియా భట్, ఒలివియా మోరీస్, అజయ్ దేవ్ గన్, శ్రీయ పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Ram Charan Ntr Rrr Movie New Sankranthi Poster Release Details, Rrr Movie, Ram Charan, Ntr, Eajamouli, New Poster, Film Industry, Ram Charan ,ntr ,rrr Movie ,sankranthi Poster Release, Director Rajamouli, Shreya, Ajay Devagan, Olivia Morris, Alia Bhatt - Telugu Ajay Devagan, Alia Bhatt, Rajamouli, Eajamouli, Poster, Olivia Morris, Ram Charan, Rrr, Shreya

#Olivia Morris #Ajay Devagan #Poster #Shreya #RRR

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube