కేసీఆర్ మాట చరణ్ నోట.. రిటర్న్ గిఫ్ట్ అదురుతుందట!

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ చిత్రాలలో బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కుతున్న ‘ఆర్ఆర్ఆర్’ కోసం యావత్ భారతదేశ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాను బాహుబలి సృష్టికర్త రాజమౌళి డైరెక్ట్ చేస్తుండటంతో దీనిపై అంచనాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో అందరికీ తెలిసిందే.

 Ram Charan Promises Return Gift To Ntr, Ram Charan, Ntr, Rrr, Rajamouli, Return-TeluguStop.com

ఇక ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు కళ్లల్లో వత్తులేసుకుని ఎదురుచూస్తున్నారు.

ఆర్ఆర్ఆర్‌లో తారక్ కొమురం భీం పాత్రలో నటిస్తుండగా, చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు.

కాగా ఇటీవల చరణ్ పుట్టినరోజును పురస్కరించుకుని అతడి పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ వీడియోను రిలీజ్ చేశారు జక్కన్న అండ్ టీమ్.ఈ ఫస్ట్ లుక్ వీడియోలో రామరాజు పాత్రను ఇంట్రొడ్యూస్ చేసిన విధానం ప్రేక్షకులను కట్టిపడేసింది.

ముఖ్యంగా ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఈ వీడియోను మరో లెవెల్‌కు తీసుకెళ్లింది.భీం ఫర్ రామరాజు అనే కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ టీజర్ వీడియో రెస్పాన్స్‌కు ఆర్ఆర్ఆర్ టీమ్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు.

కాగా నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వీడియోను తొలుత రిలీజ్ చేస్తామని అనుకున్నా, కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు.ఈ క్రమంలో తారక్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపే క్రమంలో చరణ్ తెలంగాణ సీఎం కేసీఆర్ డైలాగ్‌ను వాడటం ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

తారక్‌కు తానొక రిటర్న్ గిఫ్ట్ బాకీ ఉన్నానని, అది అద్భుతంగా ఉండబోతుందని చరణ్ చెప్పుకొచ్చాడు.మొత్తానికి చరణ్ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube