ఆర్ఆర్ఆర్ దెబ్బకి భయపడుతున్న రామ్ చరణ్  

Ram Charan Not Interested On Big Project Once Again -

ఒక సినిమాకి ఏళ్ల తరబడి పని చేయడం ఎక్కువగా హాలీవుడ్ సినిమాలలో చూస్తూ ఉంటాం.అయితే రాజమౌళి పుణ్యమా అని తెలుగు సినిమాలు కూడా సంవత్సరాల తరబడి చేసే పనిలో దర్శకులు ఉన్నారు.

Ram Charan Not Interested On Big Project Once Again

బాహుబలి సినిమా సిరిస్ కోసం రాజమౌళి ఏకంగా నాలుగేళ్ళు తీసుకున్నాడు.ఇదే దారిలో వెళ్తూ సాహో సినిమా కోసం సుజిత్ ఏకంగా రెండేళ్ళు తీసుకున్నాడు.

ఇక మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహారెడ్డి సినిమా స్టార్ట్ అయ్యి రెండేళ్ళకి పైగా అయిపోతుంది.ఇదిలా ఉంటే ఇప్పుడు తారక్, రామ్ చరణ్ లతో రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా కూడా రెండేళ్ళు పట్టేలా ఉంది.

ఆర్ఆర్ఆర్ దెబ్బకి భయపడుతున్న రామ్ చరణ్-Movie-Telugu Tollywood Photo Image

ఇదిలా ఉంటే మెగా హీరో రామ్ చరణ్ కి ఎక్కువగా గ్యాప్ తీసుకోవడం ఇష్టం ఉండదు.ప్రతి సంవత్సరం అతని నుంచి ఒక సినిమా రిలీజ్ అయ్యేలా చూసుకుంటాడు.

అయితే మగధీర తర్వాత మరోసారి రాజమౌళితో భారీ ప్రాజెక్ట్ చేయడంతో ఈ సినిమాకి ఏడాదికి పైగానే కాల్ షీట్స్ ఇచ్చేసాడు.సినిమా ప్రస్తుతం నత్తనడకగా సాగడంతో ఈ షూటింగ్ డేట్స్ కాస్తా పెరిగే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది.

ఈ నేపధ్యంలో ఆర్ఆర్ఆర్ తర్వాత మరల వెంటనే ప్రాజెక్ట్ ని సెట్స్ పైకి తీసుకెళ్లాలని రామ్ చరణ్ అనుకుంటున్నారు.అలాగే ఆర్ఆర్ఆర్ తర్వాత ఇప్పట్లో మరో సారి భారీ ప్రాజెక్ట్ జోలికి వెళ్ళకూడదు అని డిసైడ్ అయినట్లు తెలుస్తుంది.

అయిదారేళ్ల తర్వాత మళ్లీ ఏదైనా భారీ చిత్రం చేస్తాడట ఇతర భాషలలో విడుదల చేసే ఆలోచన వున్నా కానీ వాటి కోసం ఏళ్ల తరబడి సమయం కాల్ షీట్స్ ఇచ్చే పరిస్థితి లేదని చరణ్‌ చెప్పేస్తున్నాడు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ram Charan Not Interested On Big Project Once Again Related Telugu News,Photos/Pics,Images..

footer-test