వెంకీ కుడుములకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రామ్ చరణ్

మెగా హీరో రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ లో ఉన్నారు.లాక్ డౌన్ కారణంగా వాయిదా పడ్డ ఈ సినిమా షూటింగ్ మళ్ళీ ఎప్పుడు మొదలవుతుందో తెలియదు.

 Ram Charan Next Movie With Venky Kudumula, Tollywood, Telugu Cinema, South Cinem-TeluguStop.com

అయితే ఈ లోపు రామ్ చరణ్ తన నెక్స్ట్ సినిమా కోసం కథలు వింటున్నట్లు తెలుస్తుంది.ఈ నేపధ్యంలో చాలా మంది దర్శకులని పిలిపించుకొని రామ్ చరణ్ కథలు విన్నాడు.

ఆచార్య సినిమాలో కీలక పాత్ర చేస్తూ ఉండటంతో పాటు ఆర్ఆర్ఆర్ సినిమా కూడా ఈ ఏడాదిలో పూర్తి చేసి వచ్చే ఏడాది కొత్త ప్రాజెక్ట్ ని సెట్స్ పైకి తీసుకొని వెళ్లాలని రామ్ చరణ్ చూస్తూ ఉండటంతో అందుకు తగ్గ కమర్షియల్ కథని రెడీ చేసుకుంటున్నాడు.ఈ నేపధ్యంలో యంగ్ టాలెంట్ డైరెక్టర్ వెంకి కుడుముల చెప్పిన కమర్షియల్, కామెడీ ఎంటర్టైనర్ సినిమాకి రామ్ చరణ్ ఒకే చెప్పినట్లు తెలుస్తుంది.

లాక్ డౌన్ సమయంలో పలువురు దర్శకులు చెప్పిన కథలను ఆయన విన్నప్పటికీ, ఏదీ ఆయనకు అంతగా నచ్చలేదట.ఈ క్రమంలో చలో, భీష్మ చిత్రాలతో సక్సెస్ కొట్టిన దర్శకుడు వెంకీ కుడుముల ఇటీవల చెప్పిన కథ చరణ్ కు బాగా నచ్చిందని అంటున్నారు.

తాజాగా వెంకీ పూర్తి స్క్రిప్టును కూడా తయారు చేసి చరణ్ చేత ఓకే చేయించుకున్నాడని అంటున్నారు.దీంతో చరణ్ నటించే తదుపరి చిత్రం కచ్చితంగా ఇదే అవుతుందని తెలుస్తుంది.

మరో వైపు యూవీ క్రియేషన్స్ ఇప్పటికే వెంకీతో సినిమాకి అగ్రిమెంట్ చేసుకున్నారు.దీంతో ఈ ప్రాజెక్ట్ అదే బ్యానర్ లో సెట్స్ పైకి వెళ్తుందని వినిపిస్తుంది.

ఇక ఈ సినిమాకి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని ఇప్పటికే వెంకీ మొదలు పెట్టినట్లు తెలుస్తుంది.ఇక ఈ సినిమాలో కూడా రష్మిక మందనని హీరోయిన్ గా ఫైనల్ చేసినట్లు చెప్పుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube