ఆ స్టార్ డైరెక్టర్‌తో చరణ్ సినిమా.. నిజం అయితే రికార్డులు గల్లంతే!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం టాలీవుడ్ ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో క్రియేట్ అయ్యాయి.

 Ram Charan Next Movie With Shankar, Ram Charan, Rrr, Rajamouli, Shankar, Tollywo-TeluguStop.com

ఇక ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తు్న్నారు.ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

కాగా ఈ సినిమా తరువాత చరణ్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య చిత్రంలో ఓ కేమియో రోల్‌లో నటిస్తున్నాడు.ఇక ఈ సినిమా తరువాత చరణ్ సోలోగా ఏ సినిమాలో నటిస్తాడా అనే అంశంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

ఇప్పటికే పలువురు డైరెక్టర్లు చెప్పిన కథలను చరణ్ విన్నాడు.కానీ ఏ కథకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.

దీంతో చరణ్ ఎవరితో తన నెక్ట్స్ చిత్రాన్ని తెరకెక్కిస్తాడా అనేది టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.ఇక ఈ క్రమంలో ఓ స్టార్ డైరెక్టర్ చరణ్‌తో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

దక్షిణాది స్టార్ డైరెక్టర్ శంకర్ ప్రస్తుతం ఇండియన్-2 చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.కమల్ హాసన్ లీడ్ రోల్‌లో నటిస్తున్న ఈ సినిమా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది.

దీంతో శంకర్ తన నెక్ట్స్ చిత్రాన్ని రామ్ చరణ్‌తో తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు.ఇప్పటికే ఈ మేరకు చరణ్‌తో చర్చలు కూడా జరిపాడట శంకర్.

అయితే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ మాత్రం రాలేదు.దీంతో చరణ్-శంకర్ కాంబోలో సినిమా గురించి వస్తున్న వార్తలు కేవలం పుకార్లేనని చిత్ర వర్గాలు అంటున్నాయి.

మరి చరణ్ తన నెక్ట్స్ చిత్రాన్ని నిజంగానే శంకర్‌తో తెరకెక్కిస్తాడా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది.ఏదేమైనా చరణ్-శంకర్ కాంబోలో ఓ సినిమా పడితే అది ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని అభిమానులు అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube