మరో ప్రాజెక్ట్ ను ఓకే చేసిన రామ్ చరణ్ !

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్‘ సినిమాలో నటిస్తున్నాడు.ఈ సినిమాను దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు.

 Ram Charan Next Movie With Director Gowtam Tinnanuri, Ram Charan, Gowtam Tinnanu-TeluguStop.com

ఇది టాలీవుడ్ లో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీగా తెరకెక్కుతుంది.ఈ సినిమాలో రామ్ చరణ్ తో పాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా నటిస్తున్నారు.

బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకులు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.

ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది.

ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుంటే.ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తున్నాడు.

ఈ సినిమాను డివివి దానయ్య 450 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన ఆలియా భట్ నటిస్తుంతే.

ఎన్టీఆర్ సరసన విదేశీ భామ నటిస్తుంది.ఈ సినిమా అక్టోబర్ 13 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Telugu Rajamouli, Ram Charan, Ramcharan, Shankar-Latest News - Telugu

ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి ఏదో ఒక రూమర్ వస్తూ అంచనాలు పెంచేసాయి.ఈ సినిమాను భారీ బడ్జెట్ తో దిల్ రాజు నిర్మిస్తున్నాడు.అయితే ఇప్పుడు మరొక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

రామ్ చరణ్ శంకర్ తో చేస్తున్న సినిమా తర్వాత మరొక టాలెంటెడ్ దర్శకుడితో సినిమా చేయబోతున్నట్టు టాక్.రామ చరణ్ గౌతమ్ తిన్ననూరి తో సినిమా చేస్తున్నట్టు తెలుస్తుంది.

ఇప్పటికే గౌతమ్ తిన్ననూరి రామ్ చరణ్ కు స్టోరీ కూడా వినిపించాడని.ఆ స్టోరీ కూడా రామ్ చరణ్ కు బాగా నచ్చిందని.

ఓకే కూడా చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి.ఇది ఒక లవ్ స్టోరీ అని టాక్ వస్తుంది.

చూడాలి మరి ఈ వార్తలో నిజమెంతో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube