‘సభకు నమస్కారం’ పెడుతున్న చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా నటిస్తుండటంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 Ram Charan Next Movie Sabhaku Namaskaram, Ram Charan, Sabhaku Namaskaram, Direct-TeluguStop.com

ఇక ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ రికార్డులకు ఎసరుపెట్టారు తారక్ మరియు చరణ్‌లు.

కాగా ఈ సినిమా తరువాత చరణ్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాలో కేమియో పాత్రలో నటించేందుకు రెడీ అవుతున్నాడు.

ఈ సినిమా తరువాత సోలోగా మళ్లీ పవర్‌ఫుల్ చిత్రాన్ని తెరకెక్కించేందుకు చరణ్ ఇప్పటికే కథలు వింటున్నాడు.వినయ విధేయ రామ్ తరువాత చరణ్ సోలోగా నటించిన సినిమా ఇంకా రాలేదు.

దీంతో ఈసారి సోలోగానే హిట్ కొట్టేందుకు చరణ్ చూస్తున్నాడు.

ఈ క్రమంలోనే కొత్త డైరెక్టర్ సతీష్ చరణ్‌కు ఓ అదిరిపోయే స్క్రిప్టును వినిపించాడట.

ఈ సినిమాకు సభకు నమస్కారం అనే టైటిల్‌ను పెట్టాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.ఈ సినిమాలో ప్రస్తుత పరిస్థితులపై సెటైర్ విసిరేందుకు చరణ్ రెడీ అవుతున్నాడు.

టైటిల్‌తోనే ఆకటుంటున్న ఈ సినిమాకు చరణ్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.కాగా ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నాడు.

మరి ఈ సినిమా ఎలాంటి కథతో వస్తుందా, ఇందులో చరణ్ పాత్ర ఎలా ఉండబోతుందా అనే అంశాలు తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube