రామ్‌ చరణ్‌ ఎటూ తేల్చుకోలేక పోతున్నాడా?

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో పాటు ఆచార్య సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ రెండు సినిమాలు వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

 Ram Charan Next Movie Not Yet Confirm ,ram Charan, Rrr, Trivikram, Vamshi Paidip-TeluguStop.com

ఆర్ఆర్‌ఆర్‌ సినిమాలో నటిస్తున్న ఎన్టీఆర్‌ ఇప్పటికే త్రివిక్రమ్‌ దర్శకత్వంలో సినిమాను కమిట్‌ అయిన విషయం తెల్సిందే.కాని చరణ్‌ మాత్రం ఇంకా ఎవరితో సినిమా చేయాలనే విషయంలో స్పష్టత లేదు.

రామ్‌ చరణ్‌ ఇప్పటికే భారీ అంచనాల నడుమ ఆచార్య సినిమాలో నటిస్తున్నాడు.అది కేవలం గెస్ట్‌ రోల్‌ అవ్వడంతో నెల రోజుల్లోనే షూటింగ్ పూర్తి అవ్వబోతుంది.

వచ్చే ఏడాది మార్చి నుండి చరణ్‌ ఏ ప్రాజెక్ట్‌ చేతిలో లేకుండా ఖాళీగా ఉంటాడని సమాచారం అందుతోంది.అందుకే ఈ లోపు ఒక ప్రాజెక్ట్‌ ను ఫైనల్‌ చేయాలని చరణ్‌ జుట్టు పీక్కుంటున్నాడు అంటూ ఆయన సన్నిహితులు అంటున్నారు.

Telugu Acharya, Chiranjeevi, Ram Charan, Tollywood, Trivikram-Movie

పదుల సంఖ్యలో కథలు విన్న రామ్‌ చరణ్‌ చివరకు గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో సినిమా చేసేందుకు ఓకే చెప్పాడు అంటూ చాలా రోజుల క్రితం వార్తలు వచ్చాయి.ఆ తర్వాత చాలా మంది పేర్లు కూడా వినిపించాయి.కాని ఇప్పటి వరకు రామ్‌ చరణ్‌ ఎవరితో సినిమా చేయబోతున్నాడు అనే విషయంలో మాత్రం స్పష్టత లేకుండా పోయింది.రామ్‌ చరణ్‌ మోహన్‌ రాజా దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నట్లుగా ఇటీవల వార్తలు వచ్చాయి.

ఆ తర్వాత అర్జున్‌ రెడ్డి దర్శకుడితో ఒక సినిమాను చేస్తాడని కూడా ప్రచారం జరిగింది.వంశీ పైడిపల్లి కూడా కథ వినిపించాడు అంటూ ప్రచారం జరిగింది.కాని ఇప్పటి వరకు చరణ్‌ తదుపరి సినిమా విషయంలో మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకున్నట్లుగా లేడు.అందుకే రకరకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

కొత్త సంవత్సరంలో అయినా రామ్‌ చరణ్‌ ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటాడేమో అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube