ఆర్ఆర్ఆర్ తర్వాత అతనితోనే అంటున్న రామ్ చరణ్  

నెక్స్ట్ సినిమా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ప్లాన్ చేస్తున్న రామ్ చరణ్. .

Ram Charan Next Film With Vamsi Paidipalli-ram Charan Next Film,rrr,tollywood,vamsi Paidipalli

  • మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ మూవీలో చేస్తున్నాడు. ఈ మూవీ భారీ బడ్జెట్ తో తెరకేక్కుతూ ఉండటంతో దీనికోసం రామ్ చరణ్ ఏకంగా బల్క్ డేట్స్ ఇచ్చేసాడు.

  • ఆర్ఆర్ఆర్ తర్వాత అతనితోనే అంటున్న రామ్ చరణ్-Ram Charan Next Film With Vamsi Paidipalli

  • ఇక ఈ ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ ఎవరితో చేయబోతున్నాడు అనే విషయంపై ఇప్పుడు టాలీవుడ్ లో ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది.

    ఇక ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్ వినిపిస్తుంది.

  • ప్రస్తుతం మహర్షి సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న వంశీ ఆ సినిమాని రిలీజ్ చేసిన తర్వాత రామ్ చరణ్ కథపై స్క్రిప్ట్ వర్క్ మొదలెట్టబోతున్నట్లు సమాచారం. ఇక రామ్ చరణ్ కూడా ఆర్ఆర్ఆర్ మూవీలో తన షెడ్యూల్ కంప్లీట్ అయిన వెంటనే వంశీ సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్ళడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం.