'ఆర్‌ఆర్‌ఆర్‌' తర్వాత చరణ్ గ్యాప్ తీసుకుంటాడట!

రామ్ చరణ్ ఆర్ ఆర్‌ ఆర్ సినిమా కోసం దాదాపుగా మూడు సంవత్సరాలు కష్టపడ్డాడు.మద్యలో ఆచార్య లో గెస్ట్‌ రోల్‌ చేసినా కూడా పూర్తి స్థాయిలో ఆచార్య సినిమా కోసం ఆయన పడ్డ కష్టం అంతా ఇంతా కాదు అని ఆయన లుక్‌ చూస్తుంటేనే అర్థం అవుతుంది.

 Ram Charan Next Film Shooting May Be In July , Ram Charan, Ram Charan New Flim,-TeluguStop.com

బాడీ బిల్డింగ్ కోసం మరియు యాక్షన్‌ సన్నివేశాల కోసం ఒల్లు హూనం అయ్యేలా చరణ్‌ కష్టపడ్డాడు.కేవలం చరణ్ మాత్రమే కాకుండా ఇద్దరు హీరోలు కూడా చాలా కష్టపడ్డారు.

అందుకే చరణ్‌ తన తదుపరి సినిమా విషయంలో కాస్త గ్యాప్ తీసుకోవాలని కోరుకుంటున్నట్లుగా తెలుస్తోంది.లాక్ డౌన్ కారనంగా గత ఏడాది ఖాళీగానే ఉన్న చరణ్ ఈ ఏడాది ఆరంభం నుండి తీరిక లేకుండా జక్కన్న మూవీతో పాటు ఆచార్య మూవీలో కంటిన్యూస్ గా షూటింగ్‌ లో పాల్గొంటున్నాడు.

దాంతో ఆయన కు విశ్రాంతి అవసరం అన్నట్లుగా భావిస్తున్నారట.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఆచార్య దాదపుగా పూర్తి అయ్యింది.

ఇక ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్‌ బ్యాలన్స్ ఉంది.ఆ షూటింగ్ కూడా వచ్చే నెలకు పూర్తి అయ్యే అవకాశం ఉంది.

కనుక జూన్‌ నెల వరకు ఆయన పూర్తిగా విశ్రాంతి తీసుకుంటాడట.విదేశాలకు వెళ్లి మరీ ఆయన విశ్రాంతి తీసుకునే అవకాశం ఉందంటున్నారు.

చరణ్ మరియు ఉపాసనలు విదేశీ ట్రిప్ ప్లాన్‌ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.విదేశాల్లో దాదాపుగా మూడు నాలుగు వారాల పాటు విశ్రాంతి తీసుకుని వచ్చి చరణ్ ఆ వెంటనే సినిమాను మొదలు పెట్టబోతున్నాడు.

శంకర్‌ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో సినిమా కు చరణ్ ఇప్పటికే ఓకే చెప్పాడు.త్వరలోనే ఆ సినిమా అధికారికంగా పూజా కార్యక్రమాలతో మొదలు పెట్టబోతున్నారు.

అయితే జులై నెల తర్వాత రెగ్యులర్‌ షూటింగ్‌ ఉంటుందని అంటున్నారు.అందుకే జూన్‌ నెల మొత్తం కూడా చరణ్‌ పూర్తి విశ్రాంతి మూడ్‌ లోకి వెళ్తాడని అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube