రామ్‌ చరణ్ మరో సొంత నిర్మాణ సంస్థ ఎందుకో?

మెగా పవర్ స్టార్‌ రామ్ చరణ్( Ram Charan ) ఇప్పటికే కొణిదెల ప్రొడక్షన్‌ హౌస్ ( Konidela Production )ను కలిగి ఉన్న విషయం తెల్సిందే.ఆ బ్యానర్‌ లో తండ్రి హీరోగా ఖైదీ నెం.150 సినిమా ను ఇంకా పలు సినిమా లను నిర్మించిన విషయం తెల్సిందే.ఆ సినిమా లు మంచి విజయాలను సొంతం చేసుకోవడం తో పాటు భారీ లాభాలను కూడా దక్కించుకున్న విషయం తెల్సిందే.

 Ram Charan New Production House With Vikram Details, Ram Charan,vikram Reddy,meg-TeluguStop.com

ఇక రామ్‌ చరణ్ మరో కొత్త బ్యానర్‌ ను కూడా ప్రారంభించేందుకు సిద్ధం అయ్యాడు అంటూ వార్తలు వస్తున్నాయి.ప్రభాస్ కు సన్నిహితులుగా పేరున్న యూవీ క్రియేషన్స్‌( UV creations ) నిర్మాతల్లో ఒక్కరు అయిన విక్రమ్‌( Vikram reddy ) తో కలిసి రామ్‌ చరణ్ వి మెగా పిక్చర్స్( Mega Pictures ) అనే బ్యానర్ ను ప్రారంభించాడట.

త్వరలోనే ఆ బ్యానర్ లో ఒక సినిమా ప్రారంభం అవ్వబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది.చిన్న సినిమా లను నిర్మించే ఉద్దేశ్యంతో ఆ బ్యానర్ ను ఏర్పాటు చేశాడా లేదంటే తన సినిమాలను సొంతంగా నిర్మిస్తాడా అనేది చూడాలి.

Telugu Buchibabu, Latest, Ram Charan, Ramcharan, Telugu, Uv, Vikram Reddy-Movie

ప్రస్తుతం దిల్‌ రాజు నిర్మాణం లో శంకర్ దర్శకత్వం లో ఒక సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే.ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ ముగింపు దశకు చేరుకుంది.మరో వైపు చరణ్ ఒక సినిమా ను ఉప్పెన దర్శకుడు బుచ్చి బాబు దర్శకత్వం లో నటించేందుకు గాను ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఆ సినిమా ను వి మెగా పిక్చర్స్‌ బ్యానర్ లో రూపొందే అవకాశాలు ఉన్నాయి అంటూ ప్రచారం జరుగుతోంది.

ఆ విషయమై ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ రాలేదు.కానీ ప్రముఖంగా ఈ విషయమై చర్చ జరుగుతోంది.రామ్ చరణ్ మరియు బుచ్చి బాబు కాంబో మూవీ లో వచ్చే సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందబోతుంది అనే విషయం తెల్సిందే.అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఈ సమయంలో కొత్త నిర్మాణ సంస్థ ను ప్రకటించారు.కనుక కొత్త బ్యానర్ లోనే చరణ్ బుచ్చి బాబు మూవీ ఉండే అవకాశాలు ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube