మిస్టర్ బాక్సాఫీస్ సాలిడ్ లైనప్.. ఏకంగా అరడజను సినిమాలకు గ్రీన్ సిగ్నల్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ట్రిపుల్ ఆర్ వంటి పాన్ ఇండియా సినిమా తర్వాత మరింత జోష్ పెంచేసాడు.రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి పాన్ ఇండియా వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న చరణ్ నెక్స్ట్ లైనప్ పై అందరిలో ఆసక్తి నెలకొంది.

 Ram Charan Mindblowing Lineup For His Upcoming Movies Details, Ram Charan Lineup-TeluguStop.com

ప్రెజెంట్ చరణ్ RC15 చేస్తున్నాడు.అగ్ర డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.

దీని కంటే ముందే గత కొన్ని రోజుల క్రితమే చరణ్ జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో RC16 సినిమాను ప్రకటించాడు.కానీ ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యింది.

అయితే వెంటనే నెక్స్ట్ సినిమాను బుచ్చిబాబు సానాతో చేయబోతున్నట్టు అఫిషియల్ గా ప్రకటించారు.దీంతో వీరి కాంబో లోనే RC16 సినిమా వస్తుంది అని ఫిక్స్ అయ్యింది.

ఇక దీని తర్వాత కూడా చరణ్ లైనప్ పై ఏదొక వార్త నెట్టింట వైరల్ అవుతూనే ఉంది.ఈ సినిమా ఇంకా సెట్స్ మీదకు వెళ్లకుండానే మరి కొన్ని సినిమాలను లైన్లో పెట్టినట్టు టాక్.ప్రెజెంట్ శంకర్ సినిమా ఆల్ మోస్ట్ షూటింగ్ చివరి దశకు చేరుకుంది.ఈ సినిమా ఈ ఏడాది సమ్మర్ లోనే రిలీజ్ చేయనున్నారు.ఇక ఈ సినిమా పూర్తి అయిన వెంటనే నెక్స్ట్ మరో సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్లనున్నారు.

ఈ లోపు లోనే చరణ్ ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత ఒకటి రెండు కాదు ఏకంగా అరడజను సినిమాలను ఓకే చేసినట్టు తాజాగా రామ్ చరణ్ తెలిపాడు.అలాగే 2023 లో మూడు సినిమాలు ఇంకా 2024లో మూడు సినిమాలను రిలీజ్ చేసేందుకు సెట్ చేసుకున్నట్టు రామ్ చరణ్ స్వయంగా రివీల్ చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారిపోయింది.ఇక RC15 తర్వాత ఎవరితో ఉండనుందో ముందు ముందు తెలియనుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube