మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.కాని రామ్ చరణ్ ఈ సినిమా షూటింగ్ లో ఎప్పుడెప్పుడు పాల్గొంటాడా అంటూ యూనిట్ సభ్యులు వెయిట్ చేశారు.
చరణ్ మరియు చిరంజీవి కాంబోలో సీన్స్ చిత్రీకరించేందుకు సమయం కోసం కొరటాల శివ కూడా వెయిట్ చేశాడు.ఈ సమయంలో చిరంజీవి ఆచార్య సినిమాలో రామ్ చరణ్ జాయిన్ అయ్యేందుకు రాజమౌళి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని వార్తలు వస్తున్నాయి.
మార్చి నెల వరకు రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్‌ఆర్‌ఆర్ సినిమా షూటింగ్ జరుగబోతుంది.ఆ సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యే వరకు రామ్ చరణ్ కాని ఎన్టీఆర్ కాని మరో సినిమాకు సంబంధించిన షూటింగ్ లో పాల్గొనకూడదు అంటూ ఒప్పందం ఉంది.
కాని రాజమౌళి మాత్రం ఆచార్య సినిమా కోసం రామ్ చరణ్ కు ఓకే చెప్పాడు అంటూ వార్తలు వస్తున్నాయి.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఆచార్య సినిమా షూటింగ్ లో రామ్ చరణ్ జనవరి మూడవ వారంలో అంటే సంక్రాంతి తర్వాత పాల్గొనబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.ప్రస్తుతం సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణలో చిరంజీవి పాల్గొంటున్నాడు.ప్రస్తుతం షూటింగ్ జరుపుతున్న యూనిట్ సభ్యులు రామ్ చరణ్ తో షూటింగ్ జరిపితే గుమ్మడి కాయ కొట్టేయనున్నారట.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఆచార్య సినిమా షూటింగ్ కు ఫిబ్రవరి మొదటి వారం లో గుమ్మడి కాయ కొట్టేయనున్నట్లుగా చెబుతున్నారు.చిరంజీవి మరియు రామ్ చరణ్ ల కాంబో సీన్స్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అలాగే కొరటాల శివ కూడా తన దర్శకత్వంలో వారిని డైరెక్ట్ చేయబోతున్నందుకు చాలా సంతోషంగా ఉన్నాడట.ఆ విషయాన్ని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.