తండ్రితో బిజినెస్‌కు చరణ్‌ మాస్టర్‌ ప్లాన్‌!

ఈమద్య కాలంలో హీరోల పారితోషికాలు అమాంతం పెరిగాయి.ముఖ్యంగా చరణ్‌, మహేష్‌, ఎన్టీఆర్‌ వంటి యువ స్టార్‌ హీరోల పారితోషికాలు భారీ ఎత్తున పెరగడంతో నిర్మాణ వ్యయం కూడా పెరిగింది.

 Ram Charan Master Plan With Chiru-TeluguStop.com

అయితే సీనియర్‌ స్టార్‌ హీరోలకు మాత్రం పెద్దగా పారితోషికం దక్కడం లేదు.బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌లు అయిదు కోట్లు ఆలోపు పారితోషికాలు మాత్రమే అందుకుంటున్నారు.

సీనియర్‌ స్టార్‌ హీరో అయిన చిరంజీవి ఈమద్యే సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు.ఈయన పారితోషికం కూడా బాలయ్య, నాగ్‌ల స్థాయిలోనే ఉంటుందని అంతా భావించారు.

అయితే చరణ్‌ తన తండ్రి సినిమాలతో మంచి బిజినెస్‌ చేస్తూ భారీలా లాభాలను దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.

చిరంజీవి రీ ఎంట్రీ చిత్రం ‘ఖైదీ నెం.150’ చిత్రంతో నిర్మాతగా మారిన రామ్‌ చరణ్‌ ఆ తర్వాత వరుసగా సినిమాలు నిర్మించేందుకు సిద్దం అవుతున్నాడు.ఇప్పటికే చిరంజీవి సైరా నరసింహారెడ్డి చిత్రంను చరణ్‌ తన కొణిదెల ప్రొడక్షన్స్‌లో నిర్మిస్తున్న విషయం తెల్సిందే.ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది.200 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఆ చిత్రంపై చరణ్‌ చాలా ఆశలు పెట్టుకున్నాడు.దాదాపు 100 కోట్ల రూపాయల లాభంను ఆ సినిమా నుండి వస్తుందనే నమ్మకంతో చరణ్‌ ఉన్నాడు.ఇక ఆ తర్వాత చిరంజీవి చేయబోతున్న సినిమాను కూడా చరణ్‌ నిర్మించేందుకు సిద్దంగా ఉన్నాడు.

సైరా నరసింహారెడ్డి చిత్రం తర్వాత చిరంజీవి చేయబోతున్న సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించబోతున్నాడు.అందుకు సంబంధించిన చర్చలు కూడా పూర్తి అయ్యాయి.

మైత్రి మూవీస్‌ వారు ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ముందుకు వచ్చారు.అయితే చిరంజీవి పారితోషికం విషయంలో మైత్రి వారు పేచీ పెట్టడంతో రామ్‌ చరణ్‌ తాను నిర్మాతగా రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నాడు.

తన తండ్రికి కోరిన పారితోషికం ఇవ్వకుంటే సినిమాలో భాగస్వామ్యం ఇవ్వాలని చరణ్‌ మైత్రి వారితో ఒప్పందం కుదుర్చుకున్నాడు.దాంతో వారు 40 శాతం వాటాను చరణ్‌ కొణిదెల ప్రొడక్షన్స్‌కు ఇచ్చేందుకు ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది.

చిరంజీవి, కొరటాల శివ సినిమా అనగానే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.ఇక కొరటాల గత చిత్రాలు అన్ని కూడా బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి.

అందుకే చరణ్‌ ఈ చిత్రంను నిర్మించాలని, తద్వారా కనీసం 30 కోట్లు తన ఖాతాలో పడతాయని భావిస్తున్నాడు.అదే చరణ్‌ తన తండ్రికి పారితోషికం మాత్రమే తీసుకుంటే 15 కోట్లకు అటు ఇటుగానే వచ్చే అవకాశం ఉందని ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం అందుతుంది.

మొత్తానికి తన తండ్రి సినిమాలో చరణ్‌ మంచి బిజినెస్‌ చేస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube