వామ్మో.. రామ్ చరణ్ ప్లానింగ్ మామూలుగా లేదుగా..?  

ram charan locked trivikram and koratala shiva for his next movies, ram charan, back to back movies, acharya, rrr, ram charan with trivikram, special role - Telugu Acharya, Back To Back Movies, Koratala Shiva, Prashant Neel, Ram Charan, Ram Charan Locked Trivikram And Koratala Shiva For His Next Movies, Ram Charan With Trivikram, Rrr, Special Role, Trivikram

స్టార్ హీరో రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నారు.2020 సమ్మర్ టార్గెట్ గా సిద్ధమవుతున్న ఈ సినిమాలో `అల్లూరి సీతారామరాజు పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి నటిస్తున్నారు.మగధీర సినిమా తరువాత రాజమౌళి రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రెండో సినిమా ఇది.అయితే రామ్ చరణ్ ఈ సినిమా తరువాత ఎవరి దర్శకత్వంలో చేయబోతున్నాడనే ప్రశ్నకు ఇంతకాలం సమాధానం తెలియలేదు.

TeluguStop.com - Ram Charan Locked Trivikram And Koratala Shiva For His Next Movies

కెరీర్ మొదట్లో మాస్ సినిమాల్లో ఎక్కువగా నటించిన రామ్ చరణ్ ధృవ సినిమా నుంచి నవ్యత ఉన్న కథలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు.రంగస్థలం సినిమాలోని పాత్ర రామ్ చరణ్ కు నటుడిగా మంచి పేరు తెచ్చిపెట్టింది.

ఆర్ఆర్ఆర్ సినిమాతో ఇతర ఇండస్ట్రీలలో సైతం మంచి గుర్తింపు వచ్చే ఛాన్స్ ఉండటంతో రామ్ చరణ్ కొరటాల, త్రివిక్రమ్ శ్రీనివాస్ ల దర్శకత్వంలో తన భవిష్యత్తు ప్రాజెక్టులను చేయబోతున్నట్టు తెలుస్తోంది.

TeluguStop.com - వామ్మో.. రామ్ చరణ్ ప్లానింగ్ మామూలుగా లేదుగా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

చాలా సంవత్సరాల క్రితమే రామ్ చరణ్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో సినిమా తెరకెక్కాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ప్రారంభమే ఆగిపోయింది.

ప్రస్తుతం కొరటాల శివ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్య సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా ఈ సినిమాలో రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తున్నారు.కొరటాల శివ ఆచార్య తరువాత అల్లు అర్జున్ తో ఒక సినిమా చేయనున్నారు.

ఆ సినిమా తరువాత చరణ్ కొరటాల కాంబినేషన్ లో సినిమా ప్రారంభం కానుంది.

త్రివిక్రమ్ తో కూడా రామ్ చరణ్ ఒక సినిమా చేయనున్నాడని తెలుస్తోంది.

ఇప్పటివరకు చరణ్ త్రివిక్రమ్ కాంబినేషన్ తో ఒక సినిమా కూడా తెరకెక్కలేదు.ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత సరైన ప్లానింగ్ తో రామ్ చరణ్ డైరెక్టర్లను ఎంపిక చేసుకుంటున్నారు.

ఈ సినిమాలు మాత్రమే కాకుండా కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా రామ్ చరణ్ నటించే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి.

#Acharya #Trivikram #RamCharan #Prashant Neel #Koratala Shiva

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ram Charan Locked Trivikram And Koratala Shiva For His Next Movies Related Telugu News,Photos/Pics,Images..