చిరు సినిమాలో మహేష్.. మామూలు బిస్కెట్ కాదుగా!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘ఆచార్య’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాకు ఆచార్య అనే టైటిల్ పెట్టినట్లు తాజాగా చిరంజీవి స్వయంగా ఓ సినిమా వేడుకలో చెప్పడంతో ఈ సినిమా పేరు బాగా వైరల్ అయ్యింది.

 Ram Charan In Place Of Mahesh Babu In Chiru152-TeluguStop.com

ఇక ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

కాగా ఈ సినిమాలో ఓ ప్రత్యేక పాత్రలో నటించేందుకు సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్నట్లు గతకొద్ది రోజులుగా వార్తలు వస్తుండటంతో దాదాపు ఇది ఖాయమేనని అనుకున్నారు అందరు.

 Ram Charan In Place Of Mahesh Babu In Chiru152-చిరు సినిమాలో మహేష్.. మామూలు బిస్కెట్ కాదుగా-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే మెగాస్టార్ సినిమాలో సూపర్ స్టార్ కేమియో అంటే ఆ సినిమా ఓ రేంజ్‌లో ఉంటుందని అందరూ ఓ అంచనాకు వచ్చేశారు.కానీ ఇదంతా కేవలం ప్రమోషన్స్ కోసమే చేస్తున్నట్లు కొన్ని వార్తలు తాజాగా వినిపిస్తున్నాయి.

తాజాగా మహేష్ బాబు ఈ సినిమాలో కేమియో పాత్ర చేయడం లేదని, అతడి ప్లేస్‌లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్నాడని తెలుస్తోంది.కొన్ని కారణాల వల్ల మహేష్ ఈ సినిమాలో నటించడం లేదని, అందుకే చరణ్‌తో ఈ పాత్రను కానిచ్చేయాలని చిత్ర యూనిట్ ఫిక్స్ అయ్యింది.

మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించాల్సిన అవసరం ఉంది.

#Chiru152 #Chiranjeevi #Koratala Siva #Ram Charan #Mahesh Babu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు