కొరటాల దెబ్బకు డైలమాలో పడ్డ చరణ్  

Ram Charan In Confusion For His Next Movie Director, Ram Charan, RRR, Koratala Siva, Vamsi Paidipally, Venky Kudumula - Telugu Koratala Siva, Ram Charan, Rrr, Vamsi Paidipally, Venky Kudumula

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్‌లో నటిస్తోన్న సంగతి తెలిసిందే.ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు చరణ్ అండ్ టీమ్ రెడీ అవుతున్నారు.

 Ram Charan In Confusion For His Next Movie Director

కాగా ఈ సినిమాలో చరణ్‌తో పాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ చూస్తున్నారు.ఇక ఆర్ఆర్ఆర్ తరువాత చరణ్ ఏ సినిమా చేస్తాడనే విషయంపై ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ లేదు.

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ చిత్రంలో ఓ కేమియో పాత్రలో చరణ్ నటిస్తున్నాడు.ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్ట్ చేస్తుండటంతో, చరణ్‌తో కలిసి కొరటాల ఓ సినిమా చేసేందుకు గతంలో ఒప్పుకున్నాడు.

కొరటాల దెబ్బకు డైలమాలో పడ్డ చరణ్-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

కానీ ఇటీవల కొరటాల తన నెక్ట్స్ మూవీని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించడంతో చరణ్ అయోమయంలో పడిపోయాడు.ఇక మరో డైరెక్టర్ వంశీ పైడిపల్లి చరణ్‌తో కలిసి ఓ సినిమా చేసేందుకు గతకొంత కాలంగా ప్రయత్నిస్తున్నాడు.

అయితే చరణ్ మాత్రం వంశీకి ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు.
ఇక మరో యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుమల కూడా తన నెక్ట్స్ చిత్రాన్ని రామ్ చరణ్‌తో తెరకెక్కించేందుకు ఆయనకు ఓ కథను వినిపించాడట.

కాగా చరణ్ నుండి గ్రీన్ సిగ్నల్ కోసం ఆయన ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది.మరి చరణ్ ఈ ఇద్దరు డైరెక్టర్స్‌లో ఎవరికి ఛాన్స్ ఇస్తాడా, తన నెక్ట్స్ చిత్రాన్ని ఎవరితో కలిసి చేస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది.

ఇక ఆర్ఆర్ఆర్‌లో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.

#Venky Kudumula #Ram Charan #RRR #Koratala Siva

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ram Charan In Confusion For His Next Movie Director Related Telugu News,Photos/Pics,Images..