'ఆచార్య' కోసం చరణ్‌ తీసుకుంటున్న పారితోషికం ఎంతో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఆచార్య సినిమాలో రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.మొదట ఆచార్య సినిమా రామ్ చరణ్ నిర్మించేందుకు రెడీ అయ్యాడు.

 Ram Charan In Acharya Movie News  Ramcharan, Acharya, Rrr, Koratala Siva, Niranj-TeluguStop.com

కానీ రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ కి మరియు ఆచార్య నిర్మాణం కు సెట్ అవ్వకపోవడం తో నిర్మాణ బాధ్యతలను కొరటాల శివ సన్నిహితుడైన నిరంజన్ రెడ్డి కి అప్పగించడం జరిగింది.ఆచార్యకు నిర్మాతగా వ్యవహరిస్తూనే జక్కన్న సినిమా షూటింగ్ లో ప్రస్తుతం పాల్గొంటున్నాడు.

అయితే ఆచార్య నిర్మాణంలో మెజార్టీ పార్ట్‌ మాత్రం నిరంజన్ రెడ్డి అంటూ సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.ఇక ఈ సినిమాలో నటిస్తున్నందుకు రామ్ చరణ్ భారీ మొత్తంలోనే పారితోషికం అందుకుంటున్నాడని అంటున్నారు.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం చిరంజీవి మరియు రాంచరణ్ పారితోషికం 25 కోట్లు ఉన్నట్లుగా తెలుస్తోంది.రామ్ చరణ్ గెస్ట్ పాత్ర చేసినా కూడా ఏకంగా పది కోట్ల వరకు రెమ్యూనరేషన్ ఇస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.

ఇంత భారీ రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు అంటే ఆచార్య సినిమాలో రామ్ చరణ్ కీలకపాత్ర అయి ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఆచార్య సినిమా షూటింగ్ కరోనా లాక్‌ డౌన్‌ కారణంగా ఏడు నెలలుగా జరగడం లేదు.

వచ్చే నెల లేదా డిసెంబర్లలో ఆచార్య షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది ప్రస్తుతం జక్కన్న మూవీ లో నటిస్తున్న రామ్ చరణ్ ఆ తర్వాత ఈ సినిమాలో నటించే అవకాశం ఉంది.తండ్రి కొడుకులు కలిసి నటిస్తున్న సినిమా అవడం వల్ల ఆచార్య సినిమా పై తెలుగు ప్రేక్షకుల్లో అంచనాలు పీక్స్ లో ఉన్నాయి.

అంచనాలకు తగ్గట్టుగా సినిమా వసూళ్లు సాధిస్తుంది అంటూ మెగా ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు.ఇది మరోసారి నాన్ బాహుబలి రికార్డ్ ను దక్కించుకోవడం ఖాయం అంటూ మెగా ఫాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube