సగంలోనే వస్తానంటోన్న చరణ్.. ఆచార్యకు అదే ప్లస్ కానుందట!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ ఇప్పటికే 40 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో చిరు ఓ సరికొత్త లుక్‌లో మనకు కనిపిస్తాడని, ఈ సినిమాలో ఆయన ఎండోమెంట్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

 Ram Charan In Acharya At This Point, Acharya, Chiranjeevi, Koratala Siva, Ram Ch-TeluguStop.com

ఇక ఈ సినిమాతో చిరు అదిరిపోయే విజయాన్ని అందుకోవడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

కాగా ఈ సినిమాలో ఓ పవర్‌ఫుల్ కేమియో పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్నాడు.

ఆచార్య చిత్ర కథను మలుపు తిప్పే పాత్రగా ఇది ఉండబోతుందని చిత్ర యూనిట్ చెబుతూ వస్తోంది.అయితే ఈ సినిమా చరణ్ పాత్ర ఎప్పుడు వస్తుందా అనే ప్రశ్నకు చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ సమయంలో చరణ్ పాత్ర గురించి ప్రస్థావన వస్తుందని, ఆ సమయంలోనే చరణ్ అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్‌తో ఎంట్రీ ఇస్తాడని తెలుస్తోంది.

అయితే ఈ యాక్షన్ సీక్వెన్స్ చిత్రానికి చాలా కీలకంగా ఉండబోతున్నట్లు సమాచారం.

ఈ సీన్ చూస్తుంటే ప్రేక్షకులకు గూస్‌బంప్స్ రావడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.ఇక ఈ సినిమాలో చరణ్ పాత్ర ఏకంగా 25 నిమిషాల పాటు ఉంటుందని చిత్ర యూనిట్ అంటోంది.

కాగా ఈ సినిమాలో చరణ్‌కు జోడీగా ఓ హీరోయిన్ కూడా ఉంటుందట.అయితే ఇంకా ఆమె ఎవరనేది ఇంకా చిత్ర యూనిట్ రివీల్ చేయలేదు.

ఇక చిరు సరసన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోండగా, చరణ్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్న సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube