మెగా ఫ్యామిలీకి ఉన్న ఆ పేరును చెరిపేసిన రామ్ చరణ్.. అదేంటంటే?

ఒకప్పుటి కాలంలో సినిమా పరిశ్రమలో సినీ బ్యానర్ లు చాలా తక్కువగా ఉండేవి.తద్వారా ఉన్న కొద్ది మంచి బ్యానర్ లలో మాత్రమే హీరోలు సినిమాలు చేసే వారు.

 Ram Charan Has Erased The Name Of The Mega Family .. Is That So Ramcharan, Chira-TeluguStop.com

మొదట్లో హీరోలకు సొంత బ్యానర్ లు లేకపోవడంతో ఇతర బ్యానర్ లలోనే సినిమాలు చేసే వారు.కాని ఇక హీరో లుగా మంచి స్టార్ డమ్ అందుకున్న తరువాత ఇక చాలా మంది హీరోలు తమ స్వంత బ్యానర్ లను ప్రారంభించారు.

కాని అందరూ తమ తమ సొంత బ్యానర్ లలో సూపర్ హిట్ చిత్రాలను తీసుకోలేకపోయారు.ఆ కోవలోకే వస్తుంది మెగా ఫ్యామిలీ.

మొదట నాగబాబు నిర్మాతగా అంజనా ప్రొడక్షన్స్ ప్రారంభించి రుద్రవీణ, త్రినేత్రుడు, ముగ్గురు మొనగాళ్లు సినిమాలు తీసినా అంజనా ప్రొడక్షన్స్ కు మాత్రం సూపర్ హిట్ ఇవ్వలేక పోయారు.

ఆ తరువాత రామ్ చరణ్ తో ఆరెంజ్ సినిమా నిర్మించినా ఆ సినిమా కూడా డిజాస్టర్ గా నిలవడమే కాకుండా నాగబాబు తీవ్ర అప్పుల ఊబిలోకి దింపిందనే చెప్పవచ్చు.

ఇక మెగా ఫ్యామిలీకి ప్రొడక్షన్ బ్యానర్స్ అచ్చి రావు అనే పేరు బలంగా పడిపోయింది.అయితే చిరంజీవి రీ ఎంట్రీ ఇస్తున్న సమయంలో కత్తి రీమేక్ గా విడుదలైన ఖైదీ నెం.150 సినిమాను రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ ను స్థాపించి కొణిదెల ప్రొడక్షన్స్ లో ఈ సినిమాను విడుదల చేసారు.ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవడమే కాకుండా కలెక్షన్ ల సునామీని సృష్టించిన విషయం తెలిసిందే.

ఇక సైరా సినిమాను కూడా విడుదల చేసి ఎంతో కొంత విజయం సాధించింది.ఏది ఏమైనా మెగా ఫ్యామిలీ ని ప్రొడక్షన్ విషయం కలిసి రాదన్న విమర్శకుల నోళ్లు మూయించి సరికొత్త రికార్డు సృష్టించాడని చెప్పవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube