ఆర్ఆర్ఆర్ సెట్ లో గ్రాండ్ గా చరణ్ పుట్టినరోజు వేడుకలు..!

దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్.ఇది బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీగా తెరకెక్కుతుంది.

 Mega Hero Ram Charan Grand Birthday Celebrations On Rrr Set, Ram Charan, Birthda-TeluguStop.com

ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.అయితే రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆర్ ఆర్ ఆర్ యూనిట్ ఆయన పుట్టిన రోజు వేడుకలను గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసింది.

తాజాగా ఈ వీడియోను విడుదల చేసారు.

ఈ వీడియోలో ఆర్ ఆర్ ఆర్ చిత్ర యూనిట్ రామ్ చరణ్ ను సర్ప్రైజ్ చేసింది.

టపాకాయల వెలుగులో హ్యాపీ బర్త్ డే రామ్ చరణ్ అనే సందేసంతో చరణ్ ను సర్ప్రైజ్ చేసింది.ఈ వీడియోలో రామ్ చరణ్ తో పాటు రాజమౌళి, డివివి దానయ్య, కార్తికేయ, సినిమాటో గ్రాఫర్ సెంథిల్ కుమార్ కనిపిస్తున్నారు.

వీరందరూ చరణ్ కు కేక్ తినిపించారు.ఈ సర్ప్రైజ్ ఇవ్వడం కోసం ఒక భారీ క్రేన్ ను ఉపయోగించినట్లు వీడియోలో తెలుస్తుంది.

రామ్ చరణ్ రేపు తన 35 వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు.ఈ సందర్భంగా ఆర్ ఆర్ ఆర్ నుండి ఒక కొత్త పోస్టర్ కూడా రాజమౌళి విడుదల చేసారు.ఈ పోస్టర్ తో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.ఇప్పటికే ఈ సినిమా 80 శాతం పూర్తి చేసుకుంది.

ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తున్నారు.

రామ్ చరణ్ సరసన ఆలియా భట్ నటిస్తుంటే.ఎన్టీఆర్ సరసన ఇంగ్లిష్ నటి ఒలీవియా మోరిస్ నటిస్తుంది.

ఈ సినిమాలో అజయ్ దేవగన్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు.ఈ సినిమాను అక్టోబర్ 13 న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube