సాయి ధరమ్ తేజ్ కోసం డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్న రామ్ చరణ్  

Ram Charan Got Driving Licence Remake Rights For Sai Dharam Tej - Telugu Mega Family, Ram Charan Got Driving Licence Remake Rights, Sai Dharam Tej, Tollywood

మెగా హీరో రామ్ చరణ్ ఓ వైపు హీరోగా చేస్తూ సొంతగా ప్రొడక్షన్ హౌస్ ఏర్పాటు చేసి తండ్రితో వరుస సినిమాలు చేస్తున్నాడు.ప్రస్తుతం కొరటాల శివ, మెగాస్టార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా రామ్ చరణ్ కొనెదల ప్రొడక్షన్ లో మూడో సినిమా.

Ram Charan Got Driving Licence Remake Rights For Sai Dharam Tej - Telugu Mega Family, Ram Charan Got Driving Licence Remake Rights, Sai Dharam Tej, Tollywood-Movie-Telugu Tollywood Photo Image

ఇక చిరంజీవితో మలయాళీ సూపర్ హిట్ మూవీ లూసీఫర్ రీమేక్ చేయడానికి ఆ సినిమా హక్కులు కూడా రామ్ చరణ్ ఇప్పటికే కొన్నాడు.ఇదిలా ఉంటే తాజాగా మలయాళంలో మరో సూపర్ హిట్ చిత్రం డ్రైవింగ్ లైసెన్స్ రీమేక్ రైట్స్ ని రామ్ చరణ్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది.

మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన డ్రైవింగ్ లైసెన్స్ సినిమా అక్కడ సూపర్ హిట్ అయ్యింది.అయితే ఈ సినిమా తన ఫ్యామిలీ నుంచి మీడియం రేంజ్ హీరోగా ఉన్న సాయి ధరమ్ తేజ్ తో రీమేక్ చేసేందుకు రామ్ చరణ్ రైట్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది.

రామ్ చరణ్ తన బ్యానర్ ని విస్తరించే పనిలో భాగంగా చిరంజీవితో కాకుండా తక్కువ బడ్జెట్ తో తేజ్ తో ఈ సినిమా ప్లాన్ చేస్తున్నట్లు బోగట్టా.అయితే ఈ కథని తేజు కాదంటే బయటి హీరోతో ప్లాన్ చేయాలనే ఆలోచనలో కూడా రామ్ చరణ్ ఉన్నాడని టాలీవుడ్ లో చెప్పుకుంటున్నారు.

తాజా వార్తలు