పుష్ప2 లో రామ్ చరణ్ అంటూ ప్రచారం.. ఇండస్ట్రీలో ఒకటే గుసగుసలు!

Ram Charan Going To Be A Part In Pushpa 2 Movie Speculation Details, Ram Charan, Pushpa 2, Allu Arjun, Tollywood, Climax Scene, Ram Charan Pushpa 2, Pushpa The Rule, Pushpa 2 Climax, Sukumar,

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమా గత ఏడాది విడుదల అయ్యి ఆఫీస్ వద్ద భారీగా వసూళ్లను సాధించిన విషయం తెలిసిందే.ఈ సినిమాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా మారిన విషయం తెలిసిందే.

 Ram Charan Going To Be A Part In Pushpa 2 Movie Speculation Details, Ram Charan,-TeluguStop.com

ఈ సినిమాతో బాలీవుడ్ లో కూడా భారీగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు అల్లు అర్జున్.కాగా ఇటీవల రష్యాలో ఈ సినిమాను విడుదల చేసిన విషయం తెలిసిందే.

సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రష్యాకి చిత్ర బృందం మొత్తం అక్కడికి వెళ్లారు.పుష్ప సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.

ఈ సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్గా మారింది రష్మిక మందన.ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదల అయ్యి దాదాపు ఏడాది పూర్తికావస్తున్నా కూడా పుష్ప పార్ట్ 2 కి సంబంధించిన ఇంకా మొదలు కాకపోవడంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

అయితే పుష్ప 2 లో ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా సుకుమార్ కథలో మార్పులు చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.ఈ నేపథ్యంలోనే తాజాగా పార్ట్ 2 కి సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

పుష్ప 2 సినిమా క్లైమాక్స్ కు సంబంధించిన వార్త ప్రస్తుతం అల్లు అర్జున్ అభిమానులలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.పుష్ప 2 క్లైమాక్స్ లో రామ్ చరణ్ ని పరిచయం చేయబోతున్నట్టుగా వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

ఈ వార్త ప్రస్తుతం సినీ వర్గాలలో జోరుగా వినిపిస్తోంది.క్లైమాక్స్లో రామ్ చరణ్ పుష్ప తో కలిసి పోరాడుతాడని ఆ తర్వాత రామ్ చరణ్ పాత్రను హైలైట్ చేస్తూ పుష్ప తర్వాతి పార్ట్ ని ప్లాన్ చేయబోతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.ఈ వార్తలో నిజానిజాల సంగతి పక్కన పెడితే ఈ వార్త విన్న అభిమానులు మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఇకపోతే పుష్ప 2 కి సంబంధించిన షూటింగ్ ఈనెల ఆఖరిలోపు మొదలయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.

అంతే కాకుండా ఇప్పటికే సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ మొత్తం రెడీ అయినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి.వచ్చే ఏడాది ఈ సినిమాను విడుదల చేయనునట్టు తెలుస్తోంది.

Ram Charan Cameo in Allu Arjun Pushpa

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube