సైరా విషయంలో ప్రేక్షకులకు సర్ ప్రైజ్ ఇవ్వనున్న చెర్రీ  

Ram Charan Giving A Surprise About Saira Movie-

మెగా స్టార్ చిరంజీవి 151 చిత్రం స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కధ ఆధారంగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. భారీ కాస్టింగ్ తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్ర విడుదల కోసం వేయి కళ్ల తో ఎదురు చూస్తున్న ప్రేక్షకుల కోసం చెర్రీ సర్ ప్రైజ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. ఈ చిత్రాన్ని అనుకున్న డేట్ కంటే ముందే రిలీజ్ చేయాలని చెర్రీ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు..

సైరా విషయంలో ప్రేక్షకులకు సర్ ప్రైజ్ ఇవ్వనున్న చెర్రీ -Ram Charan Giving A Surprise About Saira Movie

ఖైదీ 150 చిత్రం తో తన రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన చిరు చాలా గ్యాప్ తీసుకొని మరీ ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ చేస్తున్నారు. అంతేకాకుండా సురేందర్ రెడ్డి దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ ను భారీ బడ్జెట్ తో ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రం ఎప్పుడు విడుదల అవుతుందా అని ఉత్సాహం తో ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు చెర్రీ సర్ ప్రైజ్ ఇస్తున్నాడు. తోలి నుంచి కూడా సైరా చిత్రానికి చాలానే అవాంతరాలు వచ్చాయి.

ఒకసారి అన్నపూర్ణ స్థూడియో లో సైరా కు వేసిన సెట్ అగ్నిప్రమాదానికి గురికావడం, మరోసారి సైరా సెట్ కు అనుమతి లేదంటూ సెట్ ని కూల్చివేయడం, ఇక తాజా గా చిరు ఫామ్ హౌస్ లో వేసిన సెట్ దగ్దమైపోవడం ఇలా ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. అయితే ఇటీవల జరిగిన అగ్నిప్రమాదం తో ఈ చిత్రం ముందుగా తెలిపినట్లు దసరా విడుదల అవ్వదని ఈ చిత్రాన్ని పోస్ట్ ఫోన్ చేస్తారని అందరూ భావించారు.

అయితే వారి అంచనాలను తలక్రిందులు చేస్తూ చెర్రీ ఈ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. ఈ చిత్రాన్ని దసరా కు కాకుండా అంతకంటే ముందే అక్టోబర్ 2 న విడుదల చేయాలని దీనితో ప్రేక్షకులకు సర్ ప్రైజ్ ఇవ్వాలని చూస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ప్రొడక్షన్ కు సంబంధించి అన్నీ కార్యక్రమాలు వేగవంతం చేసినట్లు సమాచారం.

ప్రేక్షకుల కోసమే చెర్రీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే దీనిపై చిత్ర యూనిట్ త్వరలో అధికారిక ప్రకటన చేయనుంది. మొత్తానికి భారీ అంచనాలతో తెరకెక్కతున్న ఈ చిత్రం అనుకున్న తేదీ కంటే ముందే సిల్వర్ స్క్రీన్ పై కనిపించనుంది..

ఈ చిత్రంలో చిరు సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార,తమన్నా నటిస్తున్నారు. అలానే ఈ చిత్రంలో అమితాబ్,సుదీప్,జగపతి బాబు,విజయ్ సేతుపతి వంటి భారీ తారాగణం కూడా ఉంది. దీనితో ఈ చిత్రం ఎలా ఉండబోతుందా అన్న ఉత్సాహం ప్రేక్షకుల్లో బాగా ఉంది.

ఇప్పుడు చెర్రీ నిర్ణయం తో ప్రేక్షకుల కు పెద్ద పండగే అని చెప్పాలి.