వివిఆర్ కోసం 5 కోట్లు వెనక్కి ఇచ్చేస్తున్న రామ్ చరణ్!  

Ram Charan Gives Return His Remuneration To Producer-

మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి, మెగా హీరో రామ్ చరణ్ కాంబినేషన్ లో డివివి దానయ్య ప్రొడక్షన్ లో వినయ విదేయ రామా సినిమా సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. అయితే లాంగ్ రన్ లో ఈ సినిమా 60 కోట్ల వరకు కలెక్ట్ చేసిన కూడా తియత్రికల్ రైట్స్ 90 కోట్లకి అమ్మడంతో బయ్యర్లకి 30 కోట్ల వరకు నష్టాలు వచ్చాయి. దీంతో ఈ సినిమా నష్టాలని తగ్గించి బయ్యర్లకి కొంత ఊరట కలిగించే ప్రయత్నం నిర్మాత, దర్శకుడు, హీరో చేస్తున్నారు. ఈ సినిమా నష్టాలలో సగం వరకు బయ్యర్లకి తిరిగి ఇవ్వడానికి నిర్మాత దానయ్య ముందుకొచ్చాడు..

వివిఆర్ కోసం 5 కోట్లు వెనక్కి ఇచ్చేస్తున్న రామ్ చరణ్!-Ram Charan Gives Return His Remuneration To Producer

దీంతో తన వంతుగా రామ్ చరణ్ కూడా 5 కోట్ల రెమ్యునరేషన్ వెనక్కి తిరిగి ఇచ్చేయడానికి రెడీ అయ్యాడు. ఇక మిగిలిన 10 కోట్లని ఎవరు ఎంత భరించాలి అనే విషయంపై దర్శక, నిర్మాతల మధ్య చర్చ నడుస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ విషయంలో దర్శకుడు బోయపాటి వెనకడుగు వేయడంతో నిర్మాత, దర్శకుడు మధ్య కొంత వాగ్వాదం తలెత్తినట్లు టాక్ వినిపిస్తుంది. ఏది ఏమైనా సినిమా నష్టాలలో బాద్యత తీసుకొని 5 కోట్లు రెమ్యునరేషన్ తిరిగి రిటర్న్ ఇచ్చేడానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రెడీ కావడం నిజంగా గొప్ప విషయం అనే చర్చ ఇప్పుడు టాలీవుడ్ లో నడుస్తుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా ఫెయిల్యూర్ పైన రామ్ చరణ్ అభిమానులకి సారీ కూడా చెప్పడం విశేషం.