డ్యాన్స్ షోకి హోస్ట్ గా రామ్ చరణ్... ఇది చాలా ప్రత్యేకం

ఈ మధ్య కాలంలో స్టార్ హీరోలు రియాలిటీ షోలకి హోస్ట్ లుగా వ్యవహరిస్తూ సందడి చేస్తున్నారు.సౌత్ లో స్టార్ హీరోలు అయినా నాగార్జున, చిరంజీవి, ఎన్ఠీఆర్, రానా లాంటి స్టార్స్ అందరూ రియాలిటీ షోలకి హోస్ట్లుగా మారి తమ టాలెంట్ చూపించారు.

 Ram Charan Gears Up To Host Online Dance Talent Show, Tollywood, Mega Family, Da-TeluguStop.com

యాంకరింగ్ తో అదరగొట్టారు.ఇదే బాటలో మిగిలిన స్టార్స్ కూడా నడవడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

ఇక మెగా హీరో రామ్ చరణ్ కూడా ఓ డాన్స్ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు.అయితే ఇది రియాలిటీ డాన్స్ షో కాకపోవడం ప్రత్యేకత.

రామ్ చరణ్ సతీమణి ఉపాసన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అపోలో లైఫ్ వైస్ చైర్ పర్సన్‌ గా బీ పాజిటివ్ మ్యాగజైన్ చీఫ్ ఎడిటర్‌.

తాజాగా యూఆర్ లైఫ్ అనే వెల్‌నెస్ ప్లాట్‌ఫాంను కూడా స్థాపించి సోషల్ యాక్టివిస్ట్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని క్రియేట్ చేసుకున్నారు.తాజాగా ఈమె దివ్యాంగులైన అమ్మాయిలు, అబ్బాయిల కోసం ఓ స్పెషల్ టాలెంట్ షోను నిర్వహిస్తున్నారు.

డ్యాన్స్ టాలెంట్ ఉన్న దివ్యాంగులను ప్రోత్సహించడానికి హీల్ యువర్ లైఫ్ త్రూ డ్యాన్స్ కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు.ఈ ఆన్ లైన్ టాలెంట్ షోకు రామ్ చరణ్ హోస్ట్‌గా వ్యవహరించబోతున్నాడు.

ఈ షోలో దిగ్గజ కొరియోగ్రాఫర్లు ఫరా ఖాన్, ప్రభుదేవా కూడా భాగం కానున్నారు.తాజాగా తపస్ అనే దివ్యాంగుడికి సంబంధించిన ఓ స్ఫూర్తివంతమైన వీడియోను షేర్ చేశారు.

దివ్యాంగులైన పిల్లల్లో ఉన్న టాలెంట్‌ను ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు.ఈ సందర్భంగా రామ్ చరణ్ కూడా ఓ వీడియో రిలీజ్ చేశాడు.

చిన్నప్పటి నుంచి నాకు డాన్స్ అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలుసు.ఇప్పుడు యునిక్ డ్యాన్స్ టాలెంట్ షో ని అనౌన్స్ చేస్తున్నాను.

టాలెంట్‌ ఉన్న దివ్యాంగ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరూ యూఆర్ లైఫ్.కో.ఇన్ లో ఎంట్రీలను పొంది మీ వీడియోలను అప్లోడ్ చేయండని రామ్ చరణ్ కోరాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube