చరణ్ బర్త్‌డేకు ‘స్పెషల్’ ప్లాన్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ మెగా ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాలో మరో స్టార్ హీరో ఎన్టీఆర్ కూడా నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందా అని యావత్ సినీ లోకం ఎంతో ఆతృతగా చూస్తున్నారు.

 Ram Charan Fans Plan Special, Ram Charan, Magadheera, Rrr, Acharya, Tollywood Ne-TeluguStop.com

ఇక ఈ సినిమాతో పాటు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ చిత్రంలో కూడా చరణ్ ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ రెండు సినిమాల రిలీజ్ డేట్‌లు కూడా ఇప్పటికే ప్రకటించారు ఆయా చిత్ర యూనిట్‌లు.

దీంతో ఈ సినిమాల్లో చరణ్ పాత్రలకు సంబంధించిన అప్‌డేట్ల కోసం అభిమానులు ఎంతో ఆతృతగా చూస్తున్నారు.ఈ క్రమంలో మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఆర్ఆర్ఆర్, ఆచార్య చిత్రాల నుండి చరణ్‌కు సంబంధించి ఖచ్చితంగా ఏదో ఒక అప్‌డేట్ ఉండాల్సిందే అని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.

అటు చరణ్ పుట్టినరోజున మెగా ఫ్యాన్స్ స్పెషల్ ప్లానింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.చరణ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ మూవీగా నిలిచిన మగధీర చిత్రాన్ని స్పెషల్ స్క్రీనింగ్ వేయాలని వారు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య 70 ఎంఎం థియేటర్లో మార్చి 27న రాత్రి 9 గంటలకు మగధీర స్పెషల్ స్క్రీనింగ్ వేయనున్నట్లు తెలుస్తోంది.దీనికి సంబంధించిన టికెట్లను ఆన్‌లైన్‌లో ఉంచారట మెగా ఫ్యాన్స్.

అటు చరణ్ నటిస్తున్న చిత్రాల నుండి అప్‌డేట్స్, ఇటు ఫ్యాన్స్ ఏర్పాటు చేస్తున్న స్పెషల్ స్క్రీనింగ్‌తో మెగా పవర్ స్టార్ బర్త్‌డే నిజంగానే స్పెషల్ కానుందని ఆయన అభిమానులు అంటున్నారు.ఇక ఆచార్య చిత్రంలో ‘సిద్ధ’ అనే పాత్రలో పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు చరణ్.

మరి ఈ పాత్రకు సంబంధించిన టీజర్‌ను మార్చి 27న రిలీజ్ చేస్తారా లేదా అనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube