రాజమౌళిపై రామ్‌ చరణ్‌ ఫ్యాన్స్‌ ఆగ్రహం.. జక్కన్న మూవీ అంటే తప్పదు మరి  

  • ఈనెల 27వ తారీకున రామ్‌ చరణ్‌ బర్త్‌డే సందర్బంగా రాజమౌళి ఫ్యాన్స్‌కు ఒక మంచి కానుక ఇవ్వబోతున్నాడు అంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది. భారీ ఎత్తున రూపొందుతున్న ఆర్‌ఆర్‌ఆర్‌ మల్టీస్టారర్‌ మూవీకి సంబంధించి రామ్‌ చరణ్‌ ఫస్ట్‌లుక్‌ లేదంటే రామ్‌ చరణ్‌ మేకింగ్‌ వీడియోను విడుదల చేస్తారని అంతా భావించారు. కాని తాజాగా సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం రాజమౌళి ప్రస్తుతానికి ఏ విధమైన పోస్టర్‌లు కాని, వీడియోలు కాని విడుదల చేయాలనుకోవడం లేదు. జక్కన్న నిర్ణయం ఫ్యాన్స్ కు కోపం తెప్పిస్తుంది.

  • Ram Charan Fans Murmuring On Director Rajamouli-Jr Ntr Ram Rrr Movie Releasing Date Trolls Rajamouli

    Ram Charan Fans Murmuring On Director Rajamouli

  • సినిమా విడుదలకు ఇంకా సంవత్సరం టైం ఉంది. ఇలాంటి సమయంలో ఇప్పటి నుండి పోస్టర్స్‌ అంటూ విడుదల చేస్తే సినిమాపై జనాల్లో ఆసక్తి తగ్గే అవకాశం ఉందని, అందుకే ముందు నుండే ఎలాంటి వీడియోలను రివీల్‌ చేయవద్దని నిర్ణయించుకున్నారు. రామ్‌ చరణ్‌ ఫ్యాన్స్‌కు ఏదైనా స్పెషల్‌గా ఇవ్వాలని కోరుకున్నా రాజమౌళి అలా కుదరనివ్వడు. ఆ విషయంపై ఇప్పటికే క్లారిటీ వచ్చింది. రామ్‌ చరణ్‌ ఖచ్చితంగా రాజమౌళి మాట వినాల్సిందే. ఆర్‌ఆర్‌ఆర్‌ మల్టీస్టారర్‌కు సంబంధించిన ప్రతి చిన్న విషయంలో కూడా రాజమౌళి నిర్ణయమే ఫైనల్‌.

  • Ram Charan Fans Murmuring On Director Rajamouli-Jr Ntr Ram Rrr Movie Releasing Date Trolls Rajamouli
  • తన సినిమా ప్రమోషన్‌ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండే రాజమౌళి ఫస్ట్‌లుక్‌ విడుదల చేస్తే సినిమాపై ఆసక్తి తగ్గుతుందని భావిస్తున్నాడు. అందుకే ప్రస్తుతానికి చరణ్‌ లుక్‌ లేనట్లే అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు. భారీ ఎత్తున అంచనాలున్న ఆర్‌ ఆర్‌ ఆర్‌ మల్టీస్టారర్‌లో రామ్‌ చరణ్‌ తో పాటు ఎన్టీఆర్‌ కూడా నటిస్తున్న విషయం తెల్సిందే. షూటింగ్‌ ప్రస్తుతం రెండవ షెడ్యూల్‌ జరుగుతుంది. త్వరలోనే సినిమాలో నటించబోతున్న హీరోయిన్స్‌ ఎవరు అనే విషయమై క్లారిటీ రాబోతుంది. ఇప్పటి వరకు సినిమా నేపథ్యం ఏంటీ, హీరోలు ఎలా కనిపించబోతున్నారు అనే విషయాలపై కూడా జక్కన్న క్లారిటీ ఇవ్వలేదు.