ప్రభుదేవా సర్ప్రైజ్ పై చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. పోస్ట్ వైరల్!

Ram Charan Expresses Gratitude As Prabhu Deva Dances To Him Details, Prabhu Deva, Ram Charan, RC15

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ తనకంటూ స్పెషల్ గుర్తింపును సాదించు కున్నాడు.

 Ram Charan Expresses Gratitude As Prabhu Deva Dances To Him Details, Prabhu Deva-TeluguStop.com

ఇక ఇటీవలే ఈయన నటించిన ట్రిపుల్ సినిమాలో నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ అవార్డు రావడంతో రామ్ చరణ్ కు గ్లోబల్ వైడ్ గా మరింత పేరు వచ్చింది అనే చెప్పాలి.

ఆస్కార్ కోసం యుఎస్ కు వెళ్లిన చరణ్ ఆస్కార్ అందుకుని మరి ఇండియాకు చేరుకున్నాడు.

ముందుగా ఢిల్లీ, ఆ తర్వాత హైదరాబాద్ లలో ఘన స్వాగతం అందుకున్నాడు చరణ్.ఇక ఇండియన్ మైఖేల్ జాక్సన్ తమ సినిమాకు మళ్ళీ వస్తున్నందుకు నాటు నాటు స్టెప్స్ వేసి మరీ కంగ్రాట్స్ చెప్తూ చరణ్ కు నిన్న స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చారు.

శంకర్ అండ్ టీమ్ అందించిన ఈ గిఫ్ట్ చూసి చరణ్ మంచి వెల్కమ్ అందించినందుకు మాస్టర్ ప్రభుదేవా (Prabhu Deva) స్వీట్ సర్ప్రైజ్ కు కూడా థాంక్స్ చెబుతున్నాను అని పోస్ట్ చేసాడు.మళ్ళీ RC15 షూట్ లో జాయిన్ అవుతున్నందుకు ఆనందంగా ఉందని కూడా చరణ్ చెప్పాడు.ఈ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.ప్రజెంట్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా ‘RC15’.

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు తన బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.రామ్ చరణ్ పుట్టిన రోజు నాడు ఈ సినిమా నుండి మాసివ్ సర్ప్రైజ్ ఉందని అంటున్నారు.అందుకే ఈ సినిమా నుండి వచ్చే సర్ప్రైజ్ కోసం మెగా ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube