ఆచార్యలో చరణ్ ఏడిపిస్తూ వస్తాడట!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య ఇప్పటికే సగానికిపైగా షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటేందుకు చిరు రెడీ అవుతున్నాడు.

 Ram Charan Entry In Acharya To Be Emotional, Acharya, Ram Charan, Chiranjeevi, T-TeluguStop.com

ఇక ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.కాగా ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ కేమియో పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే ఈ సినిమాలో చరణ్ ఓ నక్సలైట్ పాత్రలో నటిస్తాడనే టాక్ గతకొంత కాలంగా వినిపిస్తోంది.ఈ సినిమాలో ఆయన ఎంట్రీ అదిరిపోయే రేంజ్‌లో ఉండబోతున్నట్లు చిత్ర వర్గాలు అంటున్నాయి.

కాగా ఇంటర్వెల్ సీక్వెన్స్‌లో ఆయన ఎంట్రీ ఉండబోతుందని, అది సినిమాకే హైలైట్ కానుందని చత్ర యూనిట్ అంటోంది.ఇక ఇంటర్వెల్‌లో చరణ్ ఎంట్రీ ఓ రేంజ్‌లో ఉండబోతుందని, ముఖ్యంగా ఓ ఎమోషనల్ నోట్‌తో చరణ్ ఇచ్చే ఎంట్రీ అదిరిపోతుందని చిత్ర వర్గాలు అంటున్నాయి.

కాగా ఈ సినిమాలో చరణ్ లుక్ అల్ట్రా స్టైలిష్‌గా ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ అంటోంది.

ఇక ఈ సినిమాను రామ్ చరణ్ స్వయంగా ప్రొడ్యూస్ చేస్తుండటంతో ఈ సినిమాపై అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.

కాగా ఈ సినిమాలో చిరంజీవి సరసన అందాల భామ కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది.ఇక ఈ సినిమా షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేసి సినిమాను కూడా వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

ఏదేమైనా ఆచార్య చిత్రంలో చరణ్ ఎంట్రీ ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పించే విధంగా ఉండబోతుందని చిత్ర యూనిట్ అంటోంది.మరి ఈ సినిమాలో చరణ్ చేయబోయే పాత్ర సినిమాకు ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో తెలియాలంటే ఆచార్య సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube