డ్యూయెల్ రోల్ లో రామ్ చరణ్.. ?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతుందని ఇప్పటికే అధికారిక ప్రకటన వెలువడింది.అలా అనౌన్స్ చేయగానే అంచనాలు ఒక రేంజ్ లో పెరిగాయి.ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నాడు.50 వ సినిమాగా రాబోతున్న ఈ సినిమా కోసం దిల్ రాజు తన కెరీర్ లో మొదటిసారి భారీ బడ్జెట్ పెడుతున్నాడు.

 Ram Charan Dual Role In Director Shankar Movie, Director Shankar, Ram Charan, Du-TeluguStop.com

అయితే ఈ ప్రాజెక్ట్ అలా అనౌన్స్ చేసారో లేదో అప్పటి నుండి ఏదో ఒక గాసిప్ వస్తూనే ఉన్నాయి.ఈ సినిమాలో రామ్ చరణ్ డ్యూయెల్ రోల్ లో కనిపించ బోతున్నాడని ఒక గాసిప్ చక్కర్లు కొడుతోంది.

ఈ సినిమాలో యంగ్ క్యారెక్టర్ తో పాటు ఒక ఓల్డ్ క్యారెక్టర్ కూడా ఉందట.ఈ రెండు పాత్రల్లో కూడా రామ్ చరణ్ కనిపించ బోతున్నట్టు టాక్.

Telugu Dil Raju, Shankar, Dual Role, Budget, Character, Ram Charan, Ramcharan, Y

ఇందులో డ్యూయెల్ రోల్ లో నటించేందుకు రామ్ చరణ్ ఆసక్తిగా ఉన్నట్టు సమాచారం.ఇంతకు ముందు కూడా రామ్ చరణ్ నాయక్ సినిమాలో డ్యూయెల్ రోల్ చేసాడు.కానీ ఆ రెండు రోల్స్ కూడా యంగ్ క్యారెక్టర్స్.ఇప్పుడు శంకర్ సినిమాలో మాత్రం ఒకటి యంగ్ రోల్ అయితే మరొకటి వృద్ధుడి పాత్ర.ఈ విషయంపై చిత్ర యూనిట్ చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తుంది.

ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్ లో 15 వ సినిమాగా రాబోతుంది.

మరి ఈ సినిమాలో రామ్ చరణ్ డ్యూయెల్ రోల్ లో కనిపిస్తాడో లేదో ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే.ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా నటించే హీరోయిన్ కోసం సర్చింగ్ ప్రారంభం అయ్యింది.

ఇప్పటికే లిస్టులో చాలా మంది ఉన్నారు.అయితే ప్రస్తుతం శంకర్ ఇండియన్ 2 సినిమాతో, రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ సినిమాతో బిజీగా ఉన్నారు.

ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళడానికి ఇంకా చాలా సమయం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube