చరణ్ సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ చేయబోతున్నాడా..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్సినిమాలో నటిస్తున్నాడు.ఈ సినిమాను దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు.

 Ram Charan Do A Rangasthalam Sequel, Rangasthalam, Rangasthalam Movie Sequel, Ra-TeluguStop.com

బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకులు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.ఇది టాలీవుడ్ లో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీగా తెరకెక్కుతుంది.

ఈ సినిమాలో రామ్ చరణ్ తో పాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా నటిస్తున్నారు.

ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుంటే ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తున్నాడు.

ఈ సినిమాను డివివి దానయ్య 450 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది.ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన ఆలియా భట్ నటిస్తుంతే ఎన్టీఆర్ సరసన విదేశీ భామ నటిస్తుంది.ఈ సినిమా అక్టోబర్ 13 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Telugu Ram Charan, Ramcharan, Rangasthalam, Sukumar-Latest News - Telugu

ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.ఈ సినిమాను భారీ బడ్జెట్ తో దిల్ రాజు నిర్మిస్తున్నాడు.ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి.ప్రస్తుతం శంకర్ ఇండియన్ 2 సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు.ఈ సినిమా పూర్తయిన తర్వాత చరణ్ తో సినిమా స్టార్ట్ చేస్తాడు.

రామ్ చరణ్ శంకర్ తో చేస్తున్న సినిమా తర్వాత సుకుమార్ డైరెక్షన్ లో తన సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ సినిమా చేయబోతున్నాడని ఇప్పుడు మీడియాలో వార్తలు గుప్పు మంటున్నాయి.

అయితే ఆ సినిమా మరేదో కాదు రామ్ చరణ్ కెరీర్ లో సూపర్ హిట్ అయిన రంగస్థలం సినిమాకు సీక్వెల్ చేయబోతున్నారని టాక్ వినిపిస్తుంది.సుకుమార్ ప్రస్తుతం పుష్ప సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమా తర్వాత ఈ సీక్వెల్ ఉండబోతుందని వార్తలు వస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube