ఇక్కడ కూడా అవసరమా అంటూ నితిన్ పరువు తీసిన రామ్ చరణ్... ఏమైందంటే ?

బిగ్ బాస్ ప్రారంభమై… రెండో వీకెండ్ కూడా వచ్చేసింది.ఇంటి సభ్యులంతా ఎదురు చూసే ఈ ఎపిసోడ్ కోసం ప్రేక్షకులు సైతం తెగ వెయిట్ చేస్తారు.

 Ram Charan Counters To Nithiin On Bigg Boss 5 Telugu Stage-TeluguStop.com

నాగార్జున ఏం చెప్తారు.ఎవరికి క్లాస్ తీసుకుంటాడు.

ఎవర్ని మెచ్చుకుంటారు… ఇలా ఒక్కటేమిటి… అంతా అయిపోయాక… అసలు ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ముఖ్య అంశం.అలా సరికొత్త ఇష్యూస్ తో ఈ వారం కూడా నాగార్జున షో ని తన డాన్స్ తో ఎపిసోడ్ కి వెల్కమ్ చెప్పారు.
ఈ విశేషమేమిటంటే నితిన్ హీరోగా తాజాగా రిలీజైన చిత్రం…మాస్ట్రో.ఇది హిందీ సినిమాకు రీమేక్.అయితే ఈ మధ్యే డిస్నీ హాట్ స్టార్‌లో విడుదలైన ఈ మూవీకి మంచి స్పందన వస్తోంది.దీంతో హీరో నితిన్ అంధుడిగా నటించేందుకు పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చినట్టు అయింది.

 Ram Charan Counters To Nithiin On Bigg Boss 5 Telugu Stage-ఇక్కడ కూడా అవసరమా అంటూ నితిన్ పరువు తీసిన రామ్ చరణ్… ఏమైందంటే -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఆ సినిమాను ఇంకాస్త ప్రమోషన్ చేసుకునేందుకు ఆ చిత్ర టీం. బిగ్ బాస్ స్టేజ్ మీదకు వచ్చారు.వీరిని ఆటాడించేందుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా వచ్చి… డబుల్ వినోదాన్ని అందిచారు. డిస్నీ హాట్ స్టార్ బ్రాండ్ అంబాసిడర్‌గా రామ్ చరణ్ వ్యవహరిస్తుండటంతో నేటి బిగ్ బాస్ షో స్టేజ్‌ను మెగా పవర్ స్టార్ అల్లాడించేందుకు రెడీ అయినట్టు తెలుస్తోంది.

ఇక మాస్ట్రో సినిమాలో అంధుడిగా నటించిన నితిన్.బిగ్ బాస్ స్టేజ్ మీదకు కూడా అలానే వచ్చాడు.తమన్నా దగ్గరుండి మరీ నితిన్‌ను తీసుకొచ్చింది.ఇక అలా స్టేజ్ మీదకు వచ్చిన నితిన్.రామ్ చరణ్ ముందు అంధుడిగా నటించాడు.ఏదీ కనబడనట్టుగా.రామ్ చరణ్ బాడీని పట్టుకుని తడిమాడు.“సినిమాలో అందరినీ ఆడించావ్.ఇక్కడ కూడా అవసరమా?” అని నితిన్‌కు చెర్రీ కౌంటర్ వేశాడు.

మొత్తానికి ఈ వారం ఎపిసోడ్‌లో నితిన్, రామ్ చరణ్, నాగార్జున కలిసి బిగ్ బాస్ స్టేజ్‌ను రఫ్పాడించినట్టు కనిపిస్తోంది.ప్రోమోలోనే స్టార్లందరూ కలిసి ఇలా రచ్చ చేస్తే పూర్తి ఎపిసోడ్‌లో ఇంకెంత సందడి చేశారో.ఇక కంటెస్టెంట్లను సైతం నాగార్జున బాగానే ఫ్రై చేసినట్టున్నట్టు తెలుస్తోంది.

అంతే కాకుండా ఈ వారం కొందరి పద్దతి బాగా లేదంటూ ఒక్కొక్కరికి గట్టిగానే క్లాస్ పీకినట్టు కనిపిస్తోంది.

#Nithin #BB Nagarjuna #Ram Charan #RamCharan #Tamannah

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు