కొరటాలకు చరణ్ కండీషన్.. ఏమిటో తెలుసా?  

Ram Charan Condition For Koratala Siva - Telugu Chiranjeevi, Chiru152, Koratala Siva, Ram Charan, Telugu Movie News

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల దర్శకత్వం వహిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో కూడా అతిభారీ అంచనాలు ఏర్పడ్డాయి.

Ram Charan Condition For Koratala Siva - Telugu Chiranjeevi, Chiru152, Koratala Siva, Ram Charan, Telugu Movie News-Gossips-Telugu Tollywood Photo Image

ఈ సినిమాలో మెగాస్టార్ సరికొత్త గెటప్‌లో కనిపిస్తాడని చిత్ర యూనిట్ గతంలోనే వెల్లడించింది.ఇక ఈ సినిమాలో ఓ పవర్‌ఫుల్ కేమియో పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

కాగా ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్న చరణ్, కొరటాల-చిరు సినిమాలో నటించేందుకు ఓ కండీషన్ పెట్టినట్లు తెలుస్తోంది.ఈ సినిమా షూటింగ్‌లో చరణ్ మే నెలలో జాయిన్ అవుతాడని, సింగిల్ షెడ్యూల్‌లోనే తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను ముగించాలని కొరటాలకు చెప్పాడట.

దీంతోఆయన మళ్లీ ఆర్ఆర్ఆర్ సినిమాపై పూర్తి ఫోకస్ పెట్టడానికి వీలుంటుందని చరణ్ తెలిపాడు.

పూర్తి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరంజీవి సరసన త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది.

ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.ఈ చిత్రాన్ని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌పై నిర్మిస్తున్నాడు.

తాజా వార్తలు