Chiranjeevi Ram Charan : తండ్రి మెగాస్టార్ పై మాస్ కామెంట్స్ చేసిన చరణ్.. మళ్ళీ స్ట్రాంగెస్ట్ జోన్ లోకి వచ్చారంటూ..

మెగాస్టార్ చిరంజీవి సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఈ మధ్య కాలంలో ఎంతగానో ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం వాల్తేరు వీరయ్య.కె ఎస్ రవీంద్ర ( బాబీ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మాస్ రాజా రవితేజ కూడా కీలక రోల్ లో నటిస్తున్నాడు.

 Ram Charan Comments On chiranjeevi Waltair Veerayya Boss Party Song, Waltair Ve-TeluguStop.com

ఇక మెగాస్టార్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.

దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

 Ram Charan Comments On Chiranjeevi Waltair Veerayya Boss Party Song, Waltair Ve-TeluguStop.com

ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ నిన్న రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.

దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం మెగా ఫ్యాన్స్ ను ఆకట్టు కుంటుంది.మాస్ బీట్స్ తో ఇన్ స్టంట్ చార్ట్ బస్టర్ అయ్యింది.ఇక ఈ పాటలో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటేలా మెగాస్టార్ తో ఆడిపాడింది.డీజే వీరయ్యగా మారి మెగాస్టార్ అదరగొట్టగా ఈ సాంగ్ ప్రెజెంట్ ట్రెండ్ అవుతుంది.

ఇక మెగాస్టార్ ఈ సినిమాలో చాలా కాలం తర్వాత వింటేజ్ లుక్ తో అదరగొడుతున్నాడు.మరి ఇదిలా ఉండగా ఈ సినిమా ఫస్ట్ సింగిల్ పై మెగాస్టార్ తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

ఈయన పెట్టిన ఇంట్రెస్టింగ్ పోస్ట్ నెట్టింట ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది.

రామ్ చరణ్ పోస్ట్ చేస్తూ.మరి బాస్ అయితే మళ్ళీ తన స్ట్రాంగెస్ట్ జోన్ లోకి వచ్చేసారు.బ్రదర్ సీఎస్పీ ఈ సాంగ్ ను ఫ్రెష్ అండ్ సూపర్ గా ఇచ్చారు.

అదిరింది అంటూ మాస్ పోస్ట్ ని చేయగా ఈ పోస్ట్ మెగా ఫ్యాన్స్ లో మరింత జోష్ నింపింది.ఇక ఈ సినిమా 2023 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ అఫిషియల్ గా ప్రకటించారు.

సంక్రాంతికి సీనియర్ హీరో చిరంజీవి మాత్రమే కాకుండా బాలయ్య కూడా తన సినిమాతో రాబోతున్నాడు.దీంతో ఈ సీనియర్ హీరోల్లో ఎవరు విజయం సాధిస్తారో చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube