మల్టీస్టారర్‌ కథ గురించి ఆసక్తికర కామెంట్స్‌ చేసిన రామ్‌ చరణ్‌.. అది జక్కన్న గొప్పతనం     2019-01-09   12:56:47  IST  Ramesh Palla

రాజమౌళి దర్శకత్వంలో ప్రస్తుతం రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌లు హీరోలుగా భారీ మల్టీస్టారర్‌ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. ఈ చిత్రానికి సంబంధించిన ఒక షెడ్యూల్‌ కూడా పూర్తి అయ్యింది. ఇక ఈ చిత్రం కథ గురించి రక రకాలుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Ram Charan Comments About Rajamouli Multistarrer Movie-Jr Ntr Naga Babu Ntr Biopic Pawan Kalyan Janasena Rajamouli Movie

Ram Charan Comments About Rajamouli Multistarrer Movie

ఈ చిత్రం ఏంటీ, కథ ఏంటీ అనే విషయంపై చిన్న క్లూ కూడా దర్శకుడు ఇప్పటి వరకు ఇవ్వలేదు. రాజమౌళి ఈ చిత్రం కోసం అద్బుతమైన కథను రెడీ చేశారంటూ మాత్రం చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. తాజాగా రామ్‌ చరణ్‌ కూడా అదే మాట అన్నాడు.

Ram Charan Comments About Rajamouli Multistarrer Movie-Jr Ntr Naga Babu Ntr Biopic Pawan Kalyan Janasena Rajamouli Movie

చరణ్‌ హీరోగా నటించిన వినయ విధేయ రామ విడుదలకు సిద్దం అయ్యింది. ఆ సినిమా పబ్లిసిటీలో భాగంగా చరణ్‌ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన తదుపరి ప్రాజెక్ట్స్‌ గురించి క్లారిటీ ఇచ్చాడు. చరణ్‌ తదుపరి చిత్రాల గురించి మాట్లాడుతూ… తాను ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తప్ప మరే సినిమాకు కమిట్‌ కాలేదు అన్నాడు. మల్టీస్టారర్‌ మూవీ పూర్తి అయ్యే వరకు మరే సినిమాకు కమిట్‌ అవ్వాలనుకోవడం లేదన్నాడు. ఎన్టీఆర్‌తో సినిమా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నాడు.

నాకు మరియు ఎన్టీఆర్‌కు కలిపి ఒకేసారి రాజమౌళి కథ చెప్పారు. కథ చెప్పిన తర్వాత కొన్ని నిమిషాల పాటు నేనేం మాట్లాడలేక పోయాను. ఫ్రీజ్‌లో ఉండి పోయాను. ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయా అనిపించింది. నోట నుండి మాట రాకుండా అలాగే చూస్తూ ఉండి పోయాను. ఆ సమయంలోనే ఎన్టీఆర్‌ మాట్లాడుతూ చాలా బాగా వచ్చిందని స్పందించాడు. ఎన్టీఆర్‌ మొదట స్పందించిన తర్వాత నేను ఫ్రీజ్‌ ఔట్‌ అయ్యానంటూ రాజమౌళి కథపై చరణ్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. అయితే కథ ఏ నేపథ్యంలో అనేది మాత్రం ఆయన చెప్పలేదు. అలాంటి విషయాలన్నీ కూడా రాజమౌళి నోటి నుండే రావాల్సిందే అటూ చరణ్‌ చెప్పుకొచ్చాడు. వచ్చే ఏడాది చివరి వరకు జక్కన్న మల్టీస్టారర్‌ ప్రేక్షకుల ముందుకు రానుంది. అప్పటి వరకు ఈ సస్పెన్స్‌ తప్పదు.