చిరంజీవి తనయుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్( Ram charan ) రెండో సినిమాతోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో సత్తా చాటడంతో పాటు తన మార్కెట్ ను పెంచుకున్నారు.మగధీర సినిమా తర్వాత వరుస విజయాలతో కెరీర్ పరంగా దూసుకెళుతున్న చరణ్ రంగస్థలం, ఆర్.
ఆర్.ఆర్ సినిమాలతో భారీ విజయాలను అందుకున్నారు.సుకుమార్ డైరెక్షన్ లో రంగస్థలం సినిమా( Rangasthalam movie ) తెరకెక్కగా ఈ సినిమాలోని చిట్టిబాబు పాత్రను ప్రేక్షకులు సులువుగా మరిచిపోలేరు.
సరిగ్గా వినబడని వ్యక్తి రోల్ లో నటించి చిట్టిబాబు పాత్రతో రామ్ చరణ్ విమర్శకుల ప్రశంసలను అందుకున్నారు.
రామ్ చరణ్ కెరీర్ బెస్ట్ రోల్స్ లో ఈ రోల్ కూడా ఒకటని కచ్చితంగా చెప్పవచ్చు.అయితే చరణ్ మాత్రం బుచ్చిబాబు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా గురించి మాట్లాడుతూ ఒకే ఒక్క కామెంట్ తో ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశారు.
రంగస్థలం సినిమాలోని చిట్టిబాబు రోల్ కంటే మంచి రోల్ లో తాను నటిస్తున్నానని రామ్ చరణ్ పేర్కొన్నారు.ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో బుచ్చిబాబు( Director Buchibabu ) డైరెక్షన్ లో తెరకెక్కే సినిమా షూట్ మొదలుకానుందని రామ్ చరణ్ అన్నారు.వచ్చే ఏడాది సెకండాఫ్ లో ఈ సినిమా థియేటర్లలో విడుదలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి.వెస్టర్న్ ఆడియన్స్ కు సైతం కనెక్ట్ అయ్యే విధంగా ఈ సినిమా ఉంటుందని రామ్ చరణ్ అన్నారు.
రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమాలో స్పెషల్ రోల్ లో కనిపించనున్నానని చెప్పకనే చెప్పేశారు.ఉప్పెన సినిమాతో 100 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకున్న బుచ్చిబాబు ఈ సినిమాతో ఏకంగా 1000 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంటారని భావిస్తున్నారు.మెగా అభిమానులకు మరో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను చరణ్ కు కూడా మరపురాని విజయాన్ని బుచ్చిబాబు ఇస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.